డీమోనిటైజేషన్ నిర్ణయం వెలువడిన తొలి రోజు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈరోజు సంచలన ప్రకటన చేశారు. ప్రధాని మోడీని రాజకీయాల్లో లేకుండా చేస్తానని ఆమె ప్రతిన పూనారు. తాను బతికినా, చనిపోయినా ఫర్వాలేదు కానీ, ప్రధాని మోడీని దేశ రాజకీయాల్లో కనిపించకుండా చేస్తానని అన్నారు.
కాగా, పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ ప్రతిపక్షాలు ఈ రోజు భారత్ బంద్ నకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం లేకపోవడం, ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడంపై కూడా ఆమె మాట్లాడారు. విపక్షాలన్నీ కలిసొస్తేనే ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రభుత్వం మెడలు వంచడం సాధ్యమవుతుందన్నారు.
కాగా... తిరుగులేని మెజారిటీ ప్రధాని పీఠమెక్కిన మోడీని రాజకీయాల్లో లేకుండా చేస్తానన్న మమత ప్రతిన ఇప్పుడు సంచలనంగా మారింది. రాజకీయ వర్గాల్లో ఇది పెను చర్చకు దారితీస్తోంది. అసలు మమత ప్లానేంటి... ఆమె మాటల వెనుక ఉన్న వ్యూహమేంటి.. యథాలాపంగా చేసిన ప్రతినా లేదంటే మిగతా రాజకీయ పక్షాలతో ఏదైనా రాజకీయ వేదిక ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో బీజేపీని పూర్తిగా చితగ్గొట్టడానికి ఏదైనా భారీ ప్రణాళిక రూపొందించారా అన్న చర్చలు జరుగుతున్నాయి. దశాబ్దాల పాటు బెంగాల్ ను ఏలిన సీపీఎంను పులుసులోకి లేకుండా చేసిన దీదీ సామాన్యురాలేమీ కాదు. అయితే... బెంగాల్ కే పరిమితం అయిన ఆమె అక్కడి తన విజయాన్ని దేశవ్యాప్తంగా విజయంగా మలచుకోగలరా... అన్నట్లుగానే మోడీ రాజకీయ జీవితానికి ముగింపు పలకగలరా అన్నది కాలమే నిర్ణయించాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/