బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోడీపై విమర్శలను రోజురోజుకూ తీవ్రం చేస్తున్నారు. మోడీని రాజకీయాల్లో లేకుండా చేస్తానని ఇప్పటికే ప్రతినబూనిన ఆమె తాజాగా ఈ రోజు కూడా మోడీపై విరుచుకుపడ్డారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి ముందు చాలా ఘటనలు జరిగాయంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబరు 8 కి ముందు బీజేపీ దేశంలోని పలుచోట్ల ఆస్తులను - భూములను కొనుగోలు చేసిందని ఆమె ఆరోపించారు. అందుకే, ధైర్యముంటే నోట్ల రద్దు ప్రకటనకు ముందు బీజేపీ జరిపిన లావాదేవీల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. మోడీ... హిట్లర్ - తుగ్లక్ లను మించిపోయారని ఆమె అన్నారు.
బీజేపీ - ఆర్ ఎస్ ఎస్ - భజరంగ్ దళ్ లు తమ డబ్బులను విదేశీ బ్యాంకులకు తరలించాకే మోదీ రద్దు నిర్ణయాన్ని వెలువరించారని ఆరోపించారు. తన నిర్ణయాలను ప్రజలపై రుద్దాలని చూడటం భావ్యం కాదన్నారు. ఇంతటి అన్యాయం ఎమర్జెన్సీ రోజుల్లోనూ లేదన్నారు.
చేతిలో అధికారం ఉందని ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. ఇష్టానుసారంగా చేసిన నోట్ల రద్దు కారణంగా దేశమంతా రోడ్డున పడిందన్నారు. మోడీ తీరు చూస్తుంటే.. హిట్లర్ - తుగ్లక్ లను మించిపోయారని ధ్వజమెత్తారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/