నందిగ్రామ్​ నుంచి పోటీచేస్తా.. దీదీ సంచలన ప్రకటన..!

Update: 2021-01-18 14:30 GMT
పశ్చిమబెంగాల్​ సీఎం, ఫైర్​ బ్రాండ్​ మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను నందిగ్రామ్​ నియోజకవర్గం నుంచి పోటీచేయబోతున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ విషయం ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. పశ్చిమబెంగాల్​లో నందిగ్రామ్ నియోజకవర్గం ఎంతో కీలకమైనని. ఎందుకంటే పశ్చిమబెంగాల్​లో అనేక ఏళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న తృణముల్​ కాంగ్రెస్​ నందిగ్రామ్​లో జరిగిన పోరాటంతో అధికారంలోకి వచ్చింది. నందిగ్రామ్​ పోరాటంతో ఆ పార్టీ పశ్చిమబెంగాల్​లో తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగింది.

సోమవారం తృణముల్​ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నందిగ్రామ్​లో భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. ఈ సభలో దీదీ మాట్లాడుతూ తాను నందిగ్రామ్​ నుంచి పోటీచేస్తున్నట్టు ప్రకటించారు. అయితే తాను కోల్​కతాలోని భభిన్​పూర్​ నియోజకవర్గం నుంచి కూడా పోటీచేస్తానని ఆమె ప్రకటించారు. నిజానికి 2011లో నందిగ్రామ్​ భారీ ఉద్యమం మొదలైంది. నందిగ్రామ్​ నియోజకవర్గం తృణముల్​ కాంగ్రెస్​కు రాజకీయంగా ఎంతో కలిసివచ్చింది. 2007లో పశ్చిమబెంగాల్​లో అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ ఫ్రభుత్వం నందిగ్రామ్​లో సెజ్​కు అనుమతులు ఇచ్చింది. అయితే దీనిపై అప్పట్లో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. రైతులకు మద్దతుగా తృణముల్​ కాంగ్రెస్​ ఎన్నోపోరాటాలు చేసింది.

ఈ ఆందోళనల్లో 14 మంది రైతులను పోలీసులు కాల్చిచంపారు. దీంతో ఉద్యమం మరింత తీవ్రమైంది. మమతా బెనర్జీ “మా మట్టి మనుష్” పేరుతో పర్యటించి రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీని బలోపేతం చేశారు. అయితే నందిగ్రామ్​ ఉద్యమంలో సువేందు అధికారి అనే నేత కీలకపాత్రం పోషించారు. అయితే ఆయన ఇటీవల బీజేపీలో చేరారు. దీంతో మమత ఇక్కడి నుంచే పోటీచేస్తానని ప్రకటిండం గమనార్హం.నందిగ్రామ్​ ఉద్యమాన్ని ఇప్పటికీ తమ ఖాతాలో వేసుకోవాలని ఆమె భావిస్తున్నారు. అయితే మమత నిర్ణయం ప్రస్తుతం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.


Tags:    

Similar News