ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అసంతృప్తితో ఉన్న వర్గాలు ఒక్కొక్కటిగా ఏకం అవుతున్నాయి. అయితే ఇది రాజకీయపక్షాలు - ప్రాంతీయ పార్టీల వరకే పరిమితం కాలేదు. బీజేపీలోని అంతర్గత వర్గాలు సైతం నరేంద్ర మోడీపై నారాజ్ గా ఉన్న మిగతా వర్గాలను కలుస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా బీజేపీ సీనియర్ నేతలు ఫైర్ బ్రాండ్ సీఎంతో భేటీ అవడం కలకలంగా మారింది. బీజేపీ అసంతృప్త నేతలు యశ్వంత్ సిన్హా - శత్రుఘ్న సిన్హా - అరుణ్ శౌరీని తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు - పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మమతను కలుసుకుని చర్చలు జరిపారు.
యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీని ఆమె నివాసంలో మమత కలుసుకున్నారు. దాదాపు 20 నిమిషాలపాటు వీరు సమావేశమయ్యారు.భేటీ అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీ బీజేపీని ఎదుర్కోవాలని, ఈ విధంగానే బీజేపీని ఓడించటం సాధ్యమవుతుందన్న తన అభిప్రాయాన్ని తాను సోనియాకు తెలియ జేశానన్నారు. ఈ విధంగా బీజేపీతో ముఖాముఖి జరిగే పోటీకి కాంగ్రెస్ కూడా సహకరించాలని కోరానని తెలిపారు. వివిధ ప్రతిపక్ష పార్టీలతో జరుపుతున్న చర్చల గురించి కూడా తమ భేటీలో మాట్లాడుకున్నామని - ప్రతిపక్షాల ఐక్య కూటమిలో కాంగ్రెస్ కూడా పాలుపంచుకోవాలని తాము కోరుకుంటున్నామని, ఇదే విషయాన్ని సోనియాకు సూచించానని చెప్పారు.
అయితే ఈ భేటీ అనంతరం బీజేపీ సీనియర్ నేతలైన మాజీ మంత్రులు అరుణ్ శౌరీ - యశ్వంత్ సిన్హా సహా ఫైర్ బ్రాండ్ నాయకుడు శత్రుఘ్న సిన్హా సమవేశం అయ్యారు. బీజేపీలో జరుగుతున్న పరిణామాలను, సీనియర్లను పక్కనపెడుతున్న తీరును ఈ సందర్భంగా మమతతో వివరించినట్లు తెలుస్తోంది.ఇటీవలి ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఎదురవుతున్న క్రమంలో తగ్గుతున్న మోడీ గ్రాఫ్ వంటి అంశాలు చర్చకువచ్చినట్లు సమాచారం. అయితే బీజేపీ నేతలు అసంతృప్త సీఎంతో పోరాట కార్యాచరణ చర్చించడం ఆసక్తికరం.