ఫ్లైట్‌ లో ప‌డుకున్న ఆమెను అలా చేశాడ‌ట‌

Update: 2017-06-30 11:27 GMT
బుద్ధి స‌రిగా లేనోళ్లు ప్ర‌తి చోటా ఉంటార‌న్న విష‌యం ఈ మ‌ధ్య‌న త‌ర‌చూ స్ప‌ష్ట‌మ‌వుతోంది. తాజాగా అలాంటి ప‌నే చేసిన ఒక అతిగాడు ఇప్పుడు ఊచ‌లు లెక్కిస్తున్నాడు. విమానంలో తోటి ప్ర‌యాణికురాలి ప‌ట్ల దారుణంగా వ్య‌వ‌హ‌రించిన ఉదంతం ఒక‌టి కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. జూన్ 27 తెల్ల‌వారుజామున బెంగ‌ళూరు నుంచి ముంబ‌యికి వెళుతున్న విమానంలో స‌బీస్ హంజా అనే వ్య‌క్తి ఎక్కాడు.

త‌న ప‌క్క‌నున్న ప్ర‌యాణికురాలు నిద్ర‌లోకి జారుకోవ‌టాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాడు. తెల్ల‌వారుజాము ప్ర‌యాణం కార‌ణంగా.. అర్థ‌రాత్రి వేళ విమానాశ్రయానికి వ‌చ్చి ఆల‌స‌ట‌తో నిద్ర‌లోకి జారిన ఆమె ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. అభ్యంత‌ర‌క‌రంగా తాకుతూ ఆమెను వేధింపుల‌కు గురి చేశాడు.

అత‌గాడి అతిని గుర్తించిన ఆమె వెనువెంట‌నే విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వెంట‌నే స‌బీన్‌ ను హెచ్చ‌రించిన సిబ్బంది.. విమానం ముంబ‌యికి దిగిన వెంట‌నే.. అత‌న్ని ఎయిర్ పోర్ట్ భ‌ద్ర‌తా సిబ్బందికి అప్ప‌గించారు. అనంత‌రం అత‌డ్ని పోలీస్ స్టేష‌న్‌ కు తీసుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు అత‌న్ని అరెస్ట్ చేశారు. పాడు బుద్ధితో వ్య‌వ‌హ‌రించిన అత‌గాడు ఇప్పుడు కేసు చిక్కుల్లో చిక్కుకుపోయాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News