హరీశ్ ఇలాకాలో కాల్పులు కలకలం

Update: 2020-02-07 09:50 GMT
పక్కపక్కన ఉన్న నివాసితుల మధ్య గొడవలు సర్వసాధారణం. అయితే ఈ వివాదాలు కొన్నిసార్లు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. గతంలో ఇలాంటి గొడవల్లో కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం చూసే ఉంటాం. అయితే ఇలాంటి వివాదం ఇప్పుడు ఏకంగా తుపాకీ కాల్పులకు దారి తీసిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట ప్రాంతం లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అందరూ కలవర పడ్డారు. ఏకే 47తో కాల్పులు జరపడం సిద్ధిపేట జిల్లాలో కలకలం రేపుతోంది.

అక్కన్నపేట పోలీస్ స్టేషన్ పరిధి లో మూడు రోజుల కిందట సదానందం, గంగరాజు అనే ఇద్దరి మధ్య ఇటుకల విషయంలో గొడవ మొదలైంది. దీంతో అదే ఆక్రోశంతో ఉన్న సదానందం గురువారం అర్ధరాత్రి గంగరాజు ఇంటికి చేరుకుని ఏకే-47తో కాల్పులకు తెగపడ్డాడు. కుటుంబ సభ్యులతో నివాసంలో ఉన్న గంగరాజు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ప్రాణభయంతో గంగరాజుతో పాటు అతడి కుటుంబసభ్యులు చెరోదిక్కుకు వెళ్లారు. కాల్పులు జరిపిన వెంటనే

సదానందం పరారయ్యారు. అయితే గంగరాజు లక్ష్యంగా కాల్పులు జరపగా విఫలమయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గంగరాజు ఇంటిని పరిశీలించారు. ఘటనా స్థలంలో రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా గంగరాజు కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే, సదానందానికి ఏకే-47 తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఈ సందర్భంగా అక్కడి స్థానికులు మీడియాతో మాట్లాడారు. ‘‘రాత్రి 9 గంటల సమయంలో లైట్లు ఆపేసి నిద్రించేందుకు సిద్ధమయ్యాం. ఇంతలో బాంబుల చప్పుడు వినిపించింది. దీంతో మేమంతా అరిచి అందరికీ ఫోన్లు చేశాం. అందరూ వచ్చారు. తుపాకీతో మాపై కాల్పులు జరిపారు. మా ఇంట్లో బుల్లెట్లు కూడా దొరికాయి. సదానందం మా ఇంట్లోకి రాకుండా కిటికీ లో నుంచి కాల్పులు జరిపాడు. మా ఆయన వంగేసరికి బుల్లెట్లు తాకలేదు. ఆర్నెల్ల క్రితం ఇటుకల విషయంలో ఓ వివాదం తలెత్తింది. దీనిపై మూడు రోజుల క్రితం గొడవ కూడా జరిగింది. అప్పుడు గంగరాజును ఆయన దుర్భాషలాడాడు.’’ అని గంగరాజు కుటుంబసభ్యులు తెలిపారు.

అయితే నిందితుడు సదానందం గతంలో కూడా గంగరాజు పై దాడికి పాల్పడ్డాడు. కొద్ది రోజుల క్రితం కత్తి తో కూడా దాడికి దిగాడు. రాత్రి కాల్పులు జరిపినప్పుడు బుల్లెట్ నా తలపై నుంచి వెళ్లిందని బుల్లెట్ల బాధితుడు గంగరాజు తెలిపాడు.



Tags:    

Similar News