సుష్మా స్వరాజ్ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టాక ఆ శాఖ పనితీరు చాలా మెరుగైందన్న అభిప్రాయాలున్నాయి. సామాన్యులకు ఈ శాఖను చేరువ చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. సోషల్ మీడియాలో ఎవరైనా ఆ శాఖ పరిధిలోకి వచ్చే సమస్యలు చెబితే వెంటనే స్పందించి పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది సుష్మ. ఇలా ఎన్నో వందల మందికి ఆమె సాయపడ్డారు. ట్విట్టర్లో నేరుగా తనను సంప్రదించేవాళ్లందరికీ ఆమె బదులిస్తుండటం విశేషం.
తాజాగా ఫిలిప్పీన్స్ లోని మనీలాలో చదువుకుంటున్న ఓ ముస్లిం విద్యార్థి ఆమెకు తన సమస్య చెప్పుకున్నాడు. అతడి పేరు షేక్ అతీక్. తాను ఫిలిప్పీన్స్ లోని ఇండియన్ ఎంబసీలో పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేశానని.. నెల రోజులు దాటినా ఇంకా పాస్ పోర్ట్ జారీ చేయలేదని.. తాను తన స్వస్థలమైన కాశ్మీర్ కు వెళ్లి మెడికల్ చెకప్ చేయించుకోవాల్సి ఉందని.. ఈ విషయంలో తనకు సాయం చేయాలని అతను సుష్మాకు విజ్ఞప్తి చేశాడు.
కానీ అతీక్ ట్విట్టర్ బయోడేటాలో తన స్వస్థలాన్ని ‘భారత్ ఆక్రమిత కాశ్మీర్’గా పేర్కొన్నాడు. ఇది గమనించిన సుష్మ.. తాను జమ్మ-కాశ్మీర్ కు చెందిన వాళ్లకు సాయం చేస్తానని.. కానీ ‘భారత్ ఆక్రమిత కాశ్మీర్’ అంటూ తమ దేశంలో ఏ ప్రాంతం లేదని.. కాబట్టి తానేమీ చేయలేదనంటూ ఆ వ్యక్తికి దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. దీంతో వెంటనే అతీక్ తన స్వస్థలాన్ని ‘కాశ్మీర్’గా మార్చాడు. ఈ విషయంలో హర్షం ప్రకటించిన సుష్మ.. అతీక్ కు సాయపడాలని ఫిలిప్పీన్స్ లోని ఇండియన్ ఎంబసీకి సూచించింది.