పత్రికలు - టీవీలు - డిజిటల్ సహా ఇతర ప్రచార సాధనాల ద్వారా పేరున్న బ్రాండ్ల పేరుతో నకిలీ సరుకులు తయారీ చేసే వారినీ చూశాం...నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినవారిని చూశాం... కానీ అలాంటి వారిని తలదన్నే ఘనుడు వీడు. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు పేరుతో ఏకంగా ఒక నకిలీ బ్యాంకు శాఖనే ఏర్పాటు చేసి దర్జాగా నిర్వహిస్తున్నాడు. ఆయన ఉత్తరప్రదేశ్ వాసి వినోద్ కుమార్. అయితే ఎట్టకేలకు ఈ ఘనుడు పోలీసులకు చిక్కాడు లేండి.
వినోద్ కుమార్ బలియాలోని ములాయంనగర్ లో ఓ బ్యాంకును నెలకొల్పాడు. అది కర్ణాటక బ్యాంకు ప్రైవేట్ లిమిటెడ్ శాఖ అని జనాలను నమ్మించి, డిపాజిట్లు కూడా వసూలు చేశాడు. ఈ సంగతి తెలిసిన ఢిల్లీ - వారణాసిల్లోని అసలు కర్ణాటక బ్యాంకు అధికారులకు తెలిసి షాక్ తిన్నారు. తమకు ఆ రాష్ట్రంలో బ్యాంకే లేదని తెలుసుకున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దాడి చేసి సదరు బ్యాంకులో ఉన్న రూ.1.37 లక్షల నగదు - మూడు కంప్యూటర్లు - ఫోన్లు - పాస్ బుక్కులు - పే స్లిప్పులు తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ గంగూలీ తెలిపారు.