ఉన్నత స్థానాల్లో ఉన్న వారి సంభాషణల్ని గుట్టుగా రికార్డు చేయటం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఇప్పటికే ఏపీ అధికారపక్షానికి చెందిన నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్న అంశంపై సీరియస్‌గా చర్చ సాగుతుంటే.. ఈసారి ఏపీ మంత్రి ఒకరి ఛాంబర్లోనే ఆయన మాటల్ని రికార్డు చేసి అడ్డంగా బుక్ అయ్యాడో యువకుడు. ఊహించని పరిణామానికి ఉలిక్కిపడిన ఏపీ దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు అండ్ కో ఆ యువకుడి ఫోన్‌ని స్వాధీనం చేసుకొని ఆ సంభాషణల్ని డిలీట్ చేయటంతో పాటు.. రెండు తగిలించి బయటకు పంపిన వైనం తాజాగా కలకలం రేపుతోంది.
గురువారం ఏపీ దేవాదాయ శాఖామంత్రి మాణిక్యాలరావు ఛాంబర్‌లో శ్రీశైల దేవస్థానం బోర్డుకు సంబంధించిన చర్చ సాగుతోంది. కర్నూలు జిల్లా బీజేపీ నేతలు శ్రీశైలం దేవస్థానం పాలకమండలిలో పార్టీ నేత ఒకరికి అవకాశం కోసం వచ్చారు. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి.. ఈ విషయం మీద మాట్లాడటం కోసం ఒక ముఖ్యనేతకు ఫోన్ కలిపారు.
అయితే.. ఈ వ్యవహారం కోసం వచ్చిన వారితో ఉన్న ఓ వ్యక్తి.. మంత్రి సంభాషణల్ని తన ఫోన్‌లో రికార్డు చేయటాన్ని గుర్తించారు. సందేహం వచ్చిన సిబ్బంది ఆ యువకుడి ఫోన్‌ని చెక్ చేస్తే.. అందులో రికార్డు చేయటం కనిపించింది. వెంటనే దాన్ని తొలగించిన సిబ్బంది.. ఆ యువకుడికి రెండు తగిలించి గట్టిగా వార్నింగ్ ఇచ్చి బయటకు పంపినట్లు చెబుతున్నారు. ఊహించని విధంగా చోటు చేసుకున్న పరిణామానికి ఏపీ మంత్రి మాణిక్యాలరావు ఖంగుతిన్నారని చెబుతున్నారు. చూస్తుంటే.. గతంలో మాదిరి నేతలు తమ ఫోన్లకు పని చెప్పటం.. చుట్టూ ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడే విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలేమో.