ప్రియురాలిపై మోజు.. భార్య‌ను చిత‌క్కొడుతూ.. ప్రియురాలికి వీడియో కాల్‌

Update: 2022-11-26 02:30 GMT
ప్రియురాలి మోజులో పడిన ఓ వ్యక్తి భార్యను చిత‌క్కొట్టాడు. అంతేకాదు.. ప్రియురాలి ఆదేశాల‌తో వీడియో కాల్ చేసి మ‌రీ ఆమెకు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో చూపించాడు.  ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది. భర్త, అతడి ప్రియురాలు, ఆమె తల్లిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని.. ప్రియురాలి ఆదేశాలతో తనను తీవ్రంగా కొడుతున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు.. భర్త, అతడి ప్రియురాలు, ఆమె తల్లిపై కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలు.. దాడికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందజేసింది. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బాధితురాలికి భర్త నుంచి హాని ఉందన్న నేపథ్యంలో భద్రతను సైతం కల్పించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రాకు చెందిన ఓ మహిళకు రాబిన్ అనే వ్యక్తితో పదేళ్ల క్రితం వివాహమైంది. సంతోషంగా సాగిపోతున్న వీరి కాపురంలోకి ఓ మహిళ చిచ్చుపెట్టింది. భర్తను వదిలేసి విడిగా ఉంటున్న హరిపర్వత్కు చెందిన ఓ మహిళ.. రాబిన్కు పరిచయమైంది.

తన భర్తతో జరుగుతున్న గొడవలు గురించి రాబిన్కు చెప్పింది. ఆ మహిళకు రాబిన్ ఆర్థికంగా సాయం చేశాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పరిచయం ఇంకా పెరిగి.. ఫోన్లో మాట్లాడుకోవడం ప్రారంభించారు. కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారితీసింది.

''నా భర్త ఇంటికి రావడం మానేశాడు. ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదు. పిల్లలను కూడా కనీసం పట్టించుకోవట్లేదు. నా భర్త రాబిన్ ఇంటికి వచ్చేటప్పుడు.. అతడి ప్రియురాలి వీడియో కాల్ చేసి నన్ను కొట్టమని ప్రోత్సహిస్తోంది.

నా భర్త ప్రియురాలు, ఆమె తల్లి యువకులను ట్రాప్ చేసి.. డబ్బులు గుంజుకుంటున్నారు. యువకులతో సన్నిహితంగా ఉండి డబ్బులు డిమాండ్ చేస్తారు. డబ్బులు ఇవ్వమని చెబితే.. అత్యాచారం కేసు పెడతారు. వారి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అంతకుముందు వారు ఓ యువకుడు, ఆస్పత్రిలో పనిచేసే ఉద్యోగి, మరొ ఇద్దరు వ్యక్తులపై అత్యాచారం కేసులు అన్యాయంగా పెట్టారు' అని బాధితురాలు తెలిపింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News