తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్యంగా దళితులను అవమానించిన వివాదంలో చిక్కినట్లు కనిపిస్తోంది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ తాజా నిరసన పిలుపుతో ఇది తేటతెల్లం అవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి సీఎస్ రాజీవ్ శర్మను సత్కరించిన తీరు - రెండో సీఎస్ గా పదవీ విరమణ పొందిన ప్రదీప్ చంద్రను సత్కరించిన తీరును పరిశీలిస్తే మాదిగల పట్ల సీఎంకు ఉన్న చిత్తశుద్ధి తేటతెల్లం అవుతోందని మందకృష్ణ అన్నారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్రను అవమానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. మాదిగల పట్ల సీఎం మొదటి నుంచే వివక్షత ప్రదర్శిస్తున్నారని మందకృష్ణ తెలిపారు. రాజీవ్ శర్మకు పదవీ కాలం పొడిగించడంతో రెండో స్థానంలో ఉన్న ప్రదీప్ చంద్రకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత సీఎంకు ఉన్నదన్నారు. న్యాయం చేయాల్సిన సీఎం మరింత అన్యాయం చేశారని మందకృష్ణ ఆరోపించారు.
ప్రదీప్ చంద్ర మాదిగ అయినందుకే సన్మానించే కార్యక్రమానిని సీఎం హాజరు కాలేదని మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన మాదిగల ధర్మయుద్ధం వల్లనే ప్రదీప్ చంద్రను సీఎస్ గా చేశారని, లేకుంటే అక్కడ కూడా అన్యాయమే చేసేవారని మండిపడ్డారు. ప్రదీప్ చంద్రకు జరిగిన అన్యాయానికి నిరసనగా 5 - 6 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మాదిగ జాతి బిడ్డ ప్రదీప్ చంద్రకు పాలాభిషేకం చేయాలని కోరారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు మాయ మాటలు చెప్పడంలో కేసీఆర్ ను మించిన వ్యక్తిగా ఆయన తనయుడుగా కేటీఆర్ రికార్డు సృష్టిస్తున్నాడని మందకృష్ణ విమర్శించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/