పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రధాని మోడీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎన్నడూ లేని స్థాయిలో పార్లమెంటు సాక్షిగా తీవ్ర ఆరోపణలు చేశారు. మోడీ అతిపెద్ద వ్యవస్థీకృత నేరానికి దిగారని ఆరోపించారు. దీంతో మోడీ మద్దతుదారులంతా షాక్ తిన్నారు. నోట్ల రద్దు కఠిన నిర్ణయమే కావచ్చు కానీ, నేరం ఎలా అవుతుందని... దోపిడీ ఎలా అవుతుందని గగ్గోలు పెట్టారు. కానీ... తాజా పరిస్థితులు చూస్తుంటే మన్మోహన్ మాటలు అక్షర సత్యాలని రుజువవుతున్నాయి. నోట్ల రద్దు నిర్ణయంతో నల్లధనం వెలికితీత ఎంతవరకు సాధ్యమో ఏమో కానీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుకుబడి ఉన్నవారు ఎప్పటిలా తమ దందాను సాగిస్తూ మోడీ నిర్ణయాన్ని వెక్కిరిస్తున్నారు. దీంతో మన్మోహన్ చెప్పిన వ్యవస్థీకృత దోపిడీ కళ్లకు కడుతోంది.
నోట్ల రద్దుకు ముందు ఉన్న దోపిడీ వ్యవస్థ కాస్త రూటు మారింది కానీ, దోపిడీ మాత్రం యథాతథంగా సాగుతోంది. బ్యాంక్ ఉన్నతాధికారులు నల్లధన యజమానుల్తో కలసి మోడీ ఉద్దేశాలకు తూట్లు పొడుస్తున్నారు. అందుకు ఎక్కడికక్కడ దృష్టాంతాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో 26 లక్షల విలువైన 2000నోట్లను తరలిస్తూ ఓ వ్యక్తి దొరికిపోయాడు. అలాగే విజయవాడకు చెందిన నలుగురు సభ్యుల బృందం వరంగల్ లో 28లక్షల విలువైన 2000నోట్లను మారుస్తూ దొరికిపోయింది. రాజమహేంద్రవరంలో 50లక్షల విలువైన నగుదును మారుస్తూ మరో వ్యక్తి పట్టుబడ్డాడు. నడుస్తున్న రైళ్ళలోనే పాత రద్దయిన నోట్లకు బదులుగా కొత్త 2000నోట్ల మార్పిడి ప్రక్రియ జోరుగా సాగుతోంది. హైదరాబాద్ లో పోస్టాఫీసు సిబ్బంది చేస్తున్న నోట్ల మార్పిడి దందాపై ఏకంగా సీబీఐ విచారణ మొదలైంది. ఇవన్నీ ఆధారాలతో సహా అధికారులకు దొరికిన వ్యవహారాలే.
ఇదే అంశాన్ని పార్లమెంట్ లో మాజీ ప్రధాని - ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ప్రస్తావిస్తే మాత్రం అధికారపక్షనేతలు - వారి అనుకూలవర్గాల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మన్మోహన్ సింగ్ ఈ వ్యాఖ్యల్ని ఆషామాషీగా చేయలేదు. ఏకంగా పార్లమెంట్ లోనే ఈ అంశాన్ని ప్రస్తావించారు. పెద్ద నోట్ల రద్దు - చిల్లరకొరత అంశాలను వ్యవస్థీకృత దోపిడీగా ఆయన అభివర్ణించారు. ఆర్థికరంగంలో అపర మేధావి అయిన మన్మోహన్ మాటలు గాలికి అన్నవి కావని... నోట్ల రద్దు పరిణామాలను ఆయన అర్థం చేసుకుని అన్న మాటలని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. దేశంలో నల్లధనం అంతు చూడడానికి భారీ నిర్ణయం తీసుకున్న మోడీ గొప్పవారా... లేదంటే ఆ పరిణామాలు తెలుసుకుని అలాంటి చర్యల జోలికి వెళ్లని మన్మోహన్ గొప్పవారా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఈ గొప్పల సంగతి ఎలా ఉన్నా... ప్రధాని మోడీ ఇప్పటికైనా మన్మోహన్ మాటలను సూచనగా తీసుకుని ఈ వ్యవస్థీకృత దోపిడీని అరికట్టడానికి ఏం చేస్తారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/