చుట్టూ బ్లాక్ క్యాట్ కమాండోలు.. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ.. అత్యాధునిక ఆయుధాలు చేతబట్టి పహారా కాసే సాయుధులు లాంటి మాటలు చెప్పుకోవటానికే తప్పించి.. చేతల్లో అలాంటి పరిస్థితి ఏమీ లేదా? అంటే అవుననే మాట చెప్పాల్సిన పరిస్థితి. ఏపీ సీఎం చంద్రబాబు భద్రతను చూస్తే షాక్ తినక మానరు. చూసేందుకు ఫుల్ సెక్యూరిటీ అనిపించినా.. భద్రతా పరమైన డొల్లతనం తాజాగా చోటు చేసుకున్న పరిణామం చెప్పకన చెబుతోంది.
ఏపీ రాజధాని అమరావతిలో మావో సంచారం ఇప్పుడు సంచలనం సృష్టించటంతో పాటు.. ఏపీ ముఖ్యమంత్రి నివాసానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో నాలుగు రోజుల నుంచి ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది. చంద్రబాబు నివాసానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో ఒక మహిళా మావోయిస్ట్ ను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనారోగ్యంతో ఉన్న మావోయిస్ట్ అరుణ.. తాళ్లాయపాలెంలోని తన సోదరి ఇంటికి నాలుగు రోజుల క్రితం వచ్చినట్లుగా నిఘా సంస్థలు గుర్తించాయి. వెంటనే స్పందించి.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. ముఖ్యమంత్రి రక్షకు సంబంధించి ఎలాంటి రాజీ లేదన్నట్లుగా చెప్పే అధికారులు.. సీఎం నివాసానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక మావోయిస్ట్ నాలుగు రోజులుగా ఉండటాన్ని నిఘా సంస్థలు గుర్తించకపోవటం ఏమిటి? అంటే.. పైకి హడావుడి చేసే బాబు భద్రత మొత్తం డొల్లేనా..?