స్పా, మసాజ్ సెంటర్లు నగర జీవనంలో భాగమయ్యాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, రాజకీయప్రముఖులు, సినీరంగ ప్రముఖులు, ధనవంతులు రిలాక్స్ అయ్యేందుకు మసాజ్ సెంటర్లకు వెళ్తుంటారు. మనదేశంలో మసాజ్ సెంటర్ల మాటున కొన్ని చాటుమాటు వ్యవహారాలు నడుస్తుంటాయి అది వేరే విషయం. అయితే ఇక్కడ చెప్పబోయే మసాజ్ సెంటర్ చాలా భిన్నమైంది.
సాధారణంగా మసాజ్ సెంటర్లలో యువతులు వివిధ రకాల ఆయిల్స్‌తో మర్ధన చేస్తుంటారు. కానీ ఈజిప్టులోని కైరో నగరంలో ఓ మసాజ్ సెంటర్లో పాములతో మసాజ్ చేస్తున్నారు. విషరహిత పాములను శరీరం మీదకు పంపించి ఇక్కడ మసాజ్‌లు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. కీళ్లనొప్పులు ఉన్నవాళ్లకు ఈ మసాజ్‌తో ఎంతో ఉపశమనం కలుగుతుందట. అంతేకాక స్నేక్ మసాజ్‌తో రక్తప్రసరణ కూడా బాగా జరుతుతుందని స్పా నిర్వాహకులు అంటున్నారు.
అయితే ఇందులో మసాజ్ చేయించుకున్న ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘పాములను చూడగానే తొలుత భయం వేసింది. ఆ తర్వాత పాములు తాకుతూ ఉంటే ఎంతో హాయిగా అనిపించింది. ఈ తరహా మసాజ్ చాలా కొత్తగా ఉంది. ఇంతకుముందు నేను చాలా సార్లు మసాజ్ చేయించుకున్నాను. కానీ ఈ మసాజ్ చాలా రిలాక్సింగ్‌గా ఉంది. ’ అని చెప్పుకొచ్చారు.