మ‌హిళా మ‌సాజ్ థెర‌పిస్ట్ తో గేల్ అలా చేశాడ‌ట‌

Update: 2017-10-25 04:36 GMT
విధ్వంస‌క బ్యాటింగ్ తో ప్ర‌పంచ క్రికెట్ క్రీడాభిమానుల మ‌నసును దోచుకున్న అతికొద్దిమంది క్రికెట‌ర్ల‌లో క్రిస్ గేల్ ఒక‌రు. త‌న ఆట‌తో దేశాల‌కు అతీతంగా గేల్‌ను అభిమానించే వారెంద‌రో.  ఆట విష‌యంలో అత‌న్ని వంక పెట్టాల్సిన అవ‌స‌రం లేకున్నా.. మైదానం బ‌య‌ట ఆయ‌న చేసే చేష్ట‌ల మీద ప‌లు వార్త‌లు వ‌స్తుంటాయి.

ఆ మ‌ధ్య‌న క్రీడామైదానంలో ఒక మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ తో మాట్లాడే సంద‌ర్భంలో గేల్ చేసిన వ్యాఖ్య ప్ర‌పంచ వ్యాప్తంగా ఆశ్చ‌ర్య‌పోయేలా చేయ‌టంతో పాటు.. అత‌గాడి తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. బిగ్ బాష్ లీగ్ లో ఒక మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ తో మాట్లాడే సంద‌ర్భంగా.. లైవ్ టెలికాస్ట్ లోనే డేట్ కి రావాలంటూ పిల‌వ‌టం.. గేల్ తీరు విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మైంది. అత‌గాడి ప్ర‌వ‌ర్త‌న‌తో బిగ్ బాష్ టోర్నీ నుంచి శాశ్వితంగా తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇలా ఆట‌తో పాటు వివాదాల‌తో స‌హ‌జీవ‌నం చేసే గేల్‌ కు పార్టీలు.. గాళ్ ఫ్రెండ్స్ అంటూ చేసే హ‌డావుడి అంతా ఇంతా కాదు.  జీవితాన్ని ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తాడ‌న్న పేరున్న గేల్ మీద ఆరోప‌ణ‌లు చాలానే ఉన్నాయి. తాజాగా అత‌గాడి మీద ఆసీస్ మీడియా చేస్తున్న ఆరోప‌ణ‌లు హాట్ టాపిక్ గా మారాయి.  2015 ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ సంద‌ర్భంగా మ‌హిళా మ‌సాజ్ థెర‌పిస్ట్ తో గేల్ అభ్యంత‌ర‌క‌రంగా వ్య‌వ‌హ‌రించారంటూ ఆసీస్ మీడియా సంస్థ ఒక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

గేల్ తీరు మీద ఆసీస్ మీడియా సంస్థ‌లు వ‌రుస క‌థ‌నాలు ప్ర‌చురించాయి. వ‌ర‌ల్డ్ క‌ప్ సంద‌ర్భంగా ఒక మ్యాచ్ ముగిసిన అనంత‌రం గేల్ త‌న డ్రెస్సింగ్ రూమ్ కి మ‌సాజ్ థెర‌పిస్ట్‌ ని పిలిపించుకున్నాడ‌ని.. ఆమె మ‌సాజ్ చేస్తుండ‌గా త‌న మ‌ర్మాంగాన్ని చూపించిన‌ట్లుగా ఫెయిర్ ఫాక్స్ మీడియా సంస్థ వార్త‌ల్ని రాసింది.

దీనిపై గేల్ మండిప‌డుతూ ఆ సంస్థ‌పై ప‌రువున‌ష్టం దావా వేశారు. మ‌హిళా మ‌సాజ్ థెర‌పిస్ట్ తో తాను త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని.. మీడియాలో వ‌చ్చిన వార్త‌లు త‌న‌ను ఎంత‌గానో బాధించాయ‌న్నారు. కేసు విష‌యంలో తాను పోరాడాల్సి ఉంద‌ని.. కోర్టు ద్వారా పోరాడాల‌ని తాను డిసైడ్ అయిన‌ట్లుగా చెప్పుకొచ్చాడు. గేల్ త‌ర‌ఫు న్యాయ‌వాది బ్రూస్ మెక్లిన్టాక్ మాట్లాడుతూ గేల్ ప్ర‌తిష్ట‌ను మ‌స‌క‌బార్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని.. గేల్‌ను క‌నుమ‌రుగు చేయాల‌న్న‌దే వారి ఉద్దేశం అయి ఉంటుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ కేసు మ‌రో ప‌ది రోజుల్లో విచార‌ణ‌కు రానుంది.
Tags:    

Similar News