అమెరికాలో అందరూ క్రిస్మస్ పండుగ మూడ్ లో ఉండగా మరో విషాదం నెలకొంది. క్రిస్మస్ సంబరాల్లో విషాదం నెలకొంది. దీంతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. టెన్నెసీ రాష్ట్రం నాష్ విల్లే నగరంలో ఓ ప్రాంతంలో నిలిపి ఉంచిన వాహనంలో దుండగులు అమర్చిన బాంబు పేలినట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో బార్లు, రెస్టారెంట్లు అధికంగా ఉంటాయని పోలీసులు తెలిపారు.
పేలుడుకు కారణమైన దుండగుడివే ఆ శరీర భాగాలు కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. లేదా ఆ ప్రాంతంలో ఎవరైనా అయ్యి ఉండాలని అనుకుంటున్నారు. పోలీసులు విచారణ ప్రారంభించారు.
పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు, కార్లు ధ్వంసమయ్యాయి. పేలుడు ఉదయం జరగడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. పేలుడు ధాటికి కొన్ని మానవ శరీరాల అవశేషాలు అక్కడ పడ్డాయని ఖచ్చితంగా కొందరు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఎవరన్నది గుర్తించలేకపోతున్నారు.
మరో 15 నిమిషాల్లో ఈ ప్రాంతంలో బాంబు పేలే ప్రమాదం ఉందని రికార్డ్ చేసిన ఆడియోను పోలీసులకు దుండగులు పంపించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు దగ్గర్లోని భవనాలు, ఇళ్ల నుంచి అందరినీ ఖాళీ చేయించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బాంబు పేలుడు జరగడానికి ముందు ఆ ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు గుర్తు తెలియని దుండగులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ క్రమంలోనే రిక్రియేషన్ వ్యాన్ నుంచి బాంబు పేలుడు సంభవించినట్టు సమాచారం.