చంద్రుడి భారీ శకలం.. భూమిని ఢీ కొననుందా?

Update: 2021-11-23 01:30 GMT
ఎవరికీ అంత సులభంగా అర్థం కానీ వాటిలో ఖగోళశాస్త్రం ఒకటి. ఇందులో ఉండే గ్రహాలు ఉపగ్రహాలు నక్షత్రాలు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. కానీ చాలామందికి ఇందుకు సంబంధించిన సమాచారం అంత సులభంగా అర్థం కాదు. విశ్వం పుట్టుక పై ఇప్పటికే అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలోనే భూమికి దగ్గరగా ఉండే కక్ష్యలో ఒక గ్రహ శకలం తిరుగుతుండడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

దీనిని 2016 లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కానీ దీనికి సంబంధించిన సమాచారం శాస్త్రవేత్తల దగ్గర పూర్తిగా లేదు. దీని పుట్టుక గల కారణాలు పూర్తిస్థాయిలో ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అది చంద్రుని నుంచి కొంత భాగం విరిగిపోయిందని అంచనా వేస్తున్నారు. చంద్రునిని ఓ ఉల్క ఢీ కొట్టడంతో అందులోని కొంత భాగం విరిగి భూకక్ష్యలో తిరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. దీని పేరు కామో ఓవాలేవా.

శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఇది గ్రహశకలంలాగా కనిపించడం లేదని చెబుతున్నారు. ఇది కచ్చితంగా చంద్రుని ఉపరితలం నుంచి ముడిపడి ఉంటుందని భావిస్తున్నారు అయితే దీని స్వభావం గురించి పూర్తిగా తెలియాలంటే దానిపై నుంచి శాంపిళ్లను సేకరించాల్సి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే శాంపిల్ సేకరణకు అనుకున్నదానికంటే కాస్త ఎక్కువ సమయం పట్టవచ్చని పేర్కొన్నారు. దీని ఆకారం చూస్తే సుమారు నలభై మీటర్లు ఉంటుందని పరిశోధకులు వివరించారు. అయితే దీన్ని చంద్రుడు నుంచి విరిగిపడిన దానిగా భావిస్తూ ఉండటంతో... చంద్రుడుగా పిలువలేమని అంటున్నారు. అయితే పాక్షిక ఉపగ్రహంగా దీనిని పేర్కొనవచ్చని స్పష్టం చేశారు.

ఈ గ్రహశకలం ఈ మొదటగా 2016 లో శాస్త్రవేత్తలు గుర్తించారు. హవాయిలో ఉండే టెలిస్కోప్ సాయంతో దీనిని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. దీనికి మొదటగా హవాయీయన్ గా నామకరణం చేశారు. సౌర కుటుంబంలో నుంచి భూమి మాయమైపోయిన ఈ రాయి మాత్రం ఎక్కడికి పోదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా ఇది చంద్రునితో పాటు నిర్ణీత కక్ష్యలోకి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని పేర్కొన్నారు అయితే ఇలాంటి ఇ గ్రహశకలాలు చూడటం ఇదేమీ మొదటిసారి కాదు.

ఇప్పటికే ఇలాంటివి సౌరకుటుంబంలో చాలానే ఉన్నాయి. భూమి నుంచి చాలా దగ్గరగా సుమారు ఎనిమిది గ్రహశకలాలు ఇప్పటికే సంచరిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. మిగిలిన వాటికంటే ఓలే పై పరిశోధన చేయడం ఇంకా తేలికైన పని అని నిపుణుల అభిప్రాయం. మిగిలిన గ్రహశకలాలు సౌర కుటుంబంలో భాగమైనప్పటికీ వాటిని గుర్తించడం కష్టం అని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా టెలిస్కోప్ సాయంతో వీటిని గుర్తిస్తారు. ఐతే మిగిలిన ఏడు అంత సులభంగా కనిపించవు అని పేర్కొన్నారు.

ప్రస్తుతానికి దీనిని ఒక ప్రత్యేకమైన శిలగా పరిగణిస్తున్న శాస్త్రవేత్తలు ఇందులో ఖనిజాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనికి గల కారణం ఈ శిలా పెద్ద ఆకారంలో ఉన్నప్పటికీ ఎరుపు రంగుతో ప్రకాశిస్తోంది. ఈ కారణంగా ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఈ గ్రహశకలం పై ఉండే మట్టిని శాంపిల్ గా సేకరించి పరిశోధన జరిగితే దీనికి సంబంధించిన కీలక సమాచారం బయటకు వస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
Tags:    

Similar News