అమ్మాయిలు.. అబ్బాయిలకేం కావాలంటే..

Update: 2017-03-02 05:26 GMT
లైఫ్ పార్టనర్ ఎలా ఉండాలి? కాలానికి తగ్గట్లుగా అభిప్రాయాలు మారుతూ వస్తున్నాయి. తాజాగా ఎలాంటి ట్రెండ్ నడుస్తోంది. తనకు కావాల్సిన అబ్బాయిల గురించి అమ్మాయిలు ఏం కోరుకుంటున్నారు? తాను మెచ్చే అమ్మాయిలో ఏం కావాలని అబ్బాయిలు కోరుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఒక మ్యాట్రిమోని భిన్న తరహాలో ఒక సర్వేను నిర్వహించింది. ప్రశ్నలకు సమాధానాలు అడగటం సర్వేల్లో కామనే అయినా.. ఈ సర్వే కాస్త భిన్నమైంది. ఎలానంటే.. తాము చెప్పే ప్రతి సమాధానికి.. ఉదాహరణగా ఒక సెలబ్రిటీ పేరును ప్రస్తావించాల్సి ఉంటుంది.

సోషల్ మీడియాను వేదికగా చేసుకొని నిర్వహించిన ఈ ఆన్ లైన్ సర్వేలో ఆసక్తికర అంశాలకు కొదవ లేదని చెప్పాలి. 30 ఏళ్లు పైన ఉన్న వారి అభిప్రాయాల్ని ప్రాతిపదికగా తీసుకుంటూ చేసిన ఈ సర్వేలో ప్రధానమైన అంశం ఏమిటంటే.. తమ జీవిత భాగస్వాములుగా ఉంటే అబ్బాయిల్లో నిజాయితీకే పెద్దపీట వేశారు అమ్మాయిలు. అదే సమయంలో అబ్బాయిలు మాత్రం.. అమ్మాయిల అందానికే తమ ఓటు అని తేల్చేశారు.

భిన్న తరహాలో నిర్వహించిన ఈ సర్వేకు సోషల్ మీడియాలో రెస్పాన్స్ పాజిటివ్ గా వచ్చింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే 1500మంది యువతీ యువకులు రియాక్ట్ కావటం గమనార్హం.  తమకు కాబోయే వాడు షారూక్ ఖాన్ మాదిరి నిజాయితీపరుడై ఉండాలని అత్యధికులు కోరుకోవటం గమనార్హం. షారూక్ తర్వాతి స్థానం అజయ్ దేవగణ్ కే ఓటేస్తున్నారు. తర్వాతి స్థానం ఎంఎస్ ధోనీకి ఓటువేయగా.. అబ్బాయిలు మాత్రం ధోనీ విషయంలో ఒక్క శాతం కంటే తక్కువగా ఉన్నారు. అబ్బాయిలతో తామేమీ తీసిపోవటం లేదని.. జీవిత భాగస్వామి అందంగా ఉండాలన్న విషయంలో అమ్మాయిలు కూడా బలమైన అభిప్రాయాన్ని కలిగి ఉండటం గమనార్హం. అందం అంటే.. హృతిక్ రోషన్ దేనని 70 శాతం మంది అమ్మాయిలు చెబితే.. అబ్బాయిలు మాత్రం ద్రష్టిధామిని అందగెత్తగా అభివర్ణిస్తున్నారు.

అర్థం చేసుకునే పార్టనర్ ఉండాలన్న విషయంలో అమ్మాయిలు.. అబ్బాయిలు ఓటు వేయటమే కాదు.. అందుకు అమితాబ్ ను ఉదాహరణగా చూపిస్తున్నారు. తర్వాతి స్థానంలో ఎంఎస్ ధోని నిలిచారు. ఇక.. కాబోయే వారు సంఘంలో గౌరవప్రదంగా ఉండాలని కోరుకుంటున్నారు. గౌరవం విషయంలో అమితాబ్ మొదటిస్థానంలో నిలవగా.. షారూక్ తర్వాతి స్థానంలో నిలిచారు. ఈ విషయంలో కేవలం అమ్మాయిల అభిప్రాయాన్నే పరిగణలోకి తీసుకుంటే షారూక్ కు ఎక్కువ ఓట్లు వేయటం విశేషం.

జీవితభాగస్వాములు కష్టపడే తత్త్వం ఉండాలన్న విషయం మీద కూడా స్పష్టంగా ఉండటం ఈ సర్వేలో కనిపిస్తుంది. కష్టం విషయంలో అమీర్ ఖాన్ కే ఎక్కువ మంది ఓటు వేయగా.. తర్వాతి స్థానాల్లో అక్షయ్.. విరాట్ కోహ్లీ నిలుస్తున్నారు. అమ్మాయిల వరకూ వస్తే.. కష్టంలో అమీర్ ఖాన్ మొదటిస్థానం.. రెండోస్థానం విరాట్ కోహ్లీకి ఇచ్చారు. అబ్బాయిల అభిరుచి మాత్రం కాస్త వేరుగా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News