జాతీయం: చంద్రబాబును నమ్మని మాయ, మమత!

Update: 2019-05-13 10:59 GMT
తెలుగుదేశం అధినేత చంద్రాబును బీఎస్పీ అధినేత మాయవతి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీలు నమ్మడం లేదనే టాక్ మొదలైంది. చంద్రబాబు నాయుడు పక్కా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ లా వ్యవహరిస్తూ ఉన్నాడని వారు అనుమానిస్తూ ఉన్నారట. అందుకే బాబు బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ అంటూ చేస్తున్న హడావుడికి వారు దూరం అవుతున్నారని భోగట్టా!

ఇప్పుడు జాతీయ స్తాయిలో ఈ మాట వినిపిస్తూ ఉంది. కొన్నాళ్ల కిందట చంద్రాబు నాయుడు మాట్లాడుతూ.. ఫలితాలకు ముందే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీ వ్యతిరేక కూటమి పార్టీలు సమావేశాన్ని నిర్వహిస్తాయని ప్రకటించారు. మే 21ని అందుకు మూహర్తంగా బాబు ప్రకటించారు.

అయితే ఆ సమావేశం ఇప్పుడు పూర్తిగా రద్దు అయినట్టుగా సమాచారం. చంద్రబాబును మాయవతి, మమత బెనర్జీలు నమ్మకపోవడమే అందుకు కారణం అని సమాచారం! ఫలితాలకు ముందే అలా మీటింగ్ ఏర్పాటు చేసి రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనేది చంద్రబాబు ప్లాన్ అని మాయ, మమతలు పసిగట్టినట్టుగా సమాచారం.

చంద్రబాబు ట్రాప్ లో చిక్కుకోడం ఇష్టం లేక వారు.. ఆ సమావేశానికి హాజరు కావడానికి ఇష్ట పడటం లేదని తెలుస్తోంది. గత కొన్నాళ్లు చంద్రబాబు నాయుడు పూర్తి కాంగ్రెస్ విధేయుడిగా మారిపోయారు. తరచూ రాహుల్ ను కలుస్తూ భజన పరుడుగా మారారు. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ మీటింగ్ అంటూ తేదీని కూడా ప్రకటించారాయన.

బాబు పక్కా కాంగ్రస్ ఏజెంట్ లా పని చేస్తున్నాడని, రాహుల్ ను తమ భుజాల మీదకు ఎత్తడానికి బాబు ప్రయత్నిస్తున్నాడని అర్థం చేసుకున్న మాయ, మమతలు ఆ సమావేశానికి ఎర్రజెండా చూపారని, దీంతో ఫలితాలకు ముందు బీజేపీ వ్యతిరేఖ ఫ్రంట్ బేటీ ఏదీ ఉండదని స్పష్టత వస్తోందని పరిశీలకులు అంటున్నారు.
Tags:    

Similar News