నిన్న గిల్లి.. నేడు ఆయింట్ మెంట్ రాసిన మాయా!

Update: 2019-06-04 08:45 GMT
ఎవ‌రి దారిన వారు పోటీ చేసేందుకు భిన్నంగా క‌లిసిపోదాం.. కూట‌మి క‌డ‌దాం.. ప్రత్య‌ర్థి మీద పోరాడ‌దామ‌ని డిసైడ్ కావ‌టం రాజ‌కీయాల్లో మామూలే. కొన్నిసార్లు క‌లిసి వ‌చ్చే కాంబినేష‌న్లు.. మ‌రికొన్నిసార్లు అందుకు భిన్నంగా షాకిస్తుంటాయి. అలా షాక్ త‌గిలిన వేళ‌లో.. చిన్న పిల్ల‌ల మాదిరి ఉక్రోషంతో జ‌ట్టు క‌ట్టిన వారిపై విరుచుకుప‌డ‌టం అర్థం లేని ప‌ని. తాజాగా అలాంటి ప‌నే చేశారు బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీఎస్పీ.. ఎస్పీ కాంబినేష‌న్ వ‌ర్క్ వుట్ కాక‌పోవ‌టం.. పెద్ద‌గా సీట్లు రాని వైనం తెలిసిందే. దీనిపై నిన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. త‌మ మ‌హాఘ‌ట్ బంధ‌న్ ను బేకార్ కూట‌మిగా అభివ‌ర్ణించ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఎస్పీ నేత అఖిలేశ్ మీద అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌ట‌మే కాదు.. త‌న భార్య‌ను కూడా గెలిపించుకోలేక‌పోయారంటూ తెగ‌తెంపుల ప్ర‌క‌ట‌న చేసేశారు.

ఎంత ఓడితే మాత్రం మ‌రీ ఇంత దారుణంగా వ్యాఖ్య‌లు చేయ‌ట‌మా? అన్న మాట ప‌లువురి నోట రావ‌ట‌మే కాదు.. కూట‌మిలోని మిత్రుడిపై తాను చేసిన వ్యాఖ్య‌లు డ్యామేజింగ్ గా ఉన్నాయ‌న్న విష‌యాన్ని గుర్తించిన‌ట్లు ఉన్నారు. తాజాగా  మాయా మీడియా భేటీని నిర్వ‌హించారు. త‌మ కూట‌మికి గుడ్ బై చెప్పిన ఆమె.. నిన్న చేసిన తీవ్ర వ్యాఖ్య‌లపై కాస్త టోన్ త‌గ్గించి.. డోస్ ను బ్యాలెన్స్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.

త్వ‌ర‌లో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ సొంతంగా పోటీ చేస్తుంద‌న్న ఆమె.. బీఎస్పీ.. ఎస్పీ పొత్తు ప‌ని చేయ‌లేద‌ని.. యాద‌వ సామాజిక వ‌ర్గం ఓట్లు బీఎస్పీకి బ‌దిలీ కాలేద‌ని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ విడిపోవ‌టం శాశ్వితంగా కాద‌ని చెప్పిన ఆమె.. అఖిలేశ్ తో త‌న‌కు రాజ‌కీయాల‌కు అతీతంగా సంబంధాలు ఎప్ప‌టికి కొన‌సాగుతాయ‌న్నారు. అఖిలేశ్‌.. డింపుల్ దంప‌తులు త‌న‌కెంతో గౌర‌వం ఇచ్చార‌ని.. వారిని త‌న కుటుంబ స‌భ్యులుగా భావించిన‌ట్లుగా వ్యాఖ్యానించారు. మ‌రి.. అదే నిజ‌మైతే.. ఫ్యామిలీ మెంబ‌ర్స్ ప‌రువు పోయేలా ఎవ‌రైనా వ్యాఖ్య‌లు చేస్తారా? అన్న‌ది క్వ‌శ్చ‌న్. గిల్లి.. గిచ్చి.. గాయం చేసి ఇప్పుడు ఆయింట్ మెంట్ రాయాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న భావ‌న మాయా తాజా మాట‌లు విన్నంత‌నే అనిపించ‌క మాన‌దు.
Tags:    

Similar News