తెలంగాణలో గ్రీన్ ఛాలెంజ్ సంస్కృతి బాగానే ఊపందుకుంటోంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్దేశించిన ఈ ఛాలెంజ్ ను సినీ - రాజకీయ ప్రముఖులు బాగానే అందిపుచ్చుకుంటున్నారు. మొక్కలు నాటి జనాల్లో పర్యావరణం పై అవగాహన పెంచడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. టీఆర్ ఎస్ ఎంపీ సంతోష్ ఈ గ్రీన్ ఛాలెంజ్ కు శ్రీకారం చుట్టారు. ఆయన విసిరిన ఛాలెంజ్ ను టాలీవుడ్ కు చెందిన అనేక మంది ప్రముఖులు స్వీకరించారు. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. తాజాగా ప్రతి రోజూ పండగే చిత్ర బృందం గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించింది. హీరో సాయిధరమ్ తేజ్ - హీరోయిన్ రాశి ఖన్నా - దర్శకుడు మారుతి తదితరులు ఈ కార్యక్రమంలో భాగం అయ్యారు.
తాజాగా హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఈ 'గ్రీన్ ఛాలెంజ్'లో పాల్గొన్నారు. శ్రీనగర్ కాలనీ లోని పబ్లిక్ పార్కుతో కొన్ని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బొంతు రామ్మోహన్ తో పాటు తేజు - రాశి - మారుతి పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను బొంతు రామ్మోహన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంతకుముందు మంచు లక్ష్మి, సాయి పల్లవి - వరుణ్ తేజ్ - సుమ తదితర సినీ ప్రముఖులు గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల కిందట గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను టీఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ మొదలుపెట్టారు. మొక్కలు నాటిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సెప్టెంబరు 5న వనమిత్ర అవార్డ్ ను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి ఈ కార్యక్రమంలో భాగమైన వారందరికీ ఈ అవార్డులు ఇవ్వనున్నారు.