కలకలం : నిజామాబాద్ మెడికల్ కాలేజీలో మరో వైద్యవిద్యార్థి ఆత్మహత్య

Update: 2023-03-31 17:31 GMT
వరంగల్ నగరంలో వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందిన ఘటన తర్వాత వరుసగా వైద్య విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న కలకలం రేపుతున్నాయి. ఇటీవల నిజామాబాద్ మెడికల్ కాలేజీలో హర్ష అనే వైద్య విద్యార్థి సూసైడ్ తీవ్ర విషాదం నింపగా.. అతడు మరణించిన నెలరోజులకే తాజాగా మరో వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది.

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో మరో వైద్య విద్యార్థి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడడం విషాదం నింపింది. ఇది అందరినీ శోకసంద్రంలో నింపింది.

గత నెల అదే హాస్టల్ గదిలో హర్ష అనే వైద్య విద్యార్థి మృతిచెందగా.. మళ్లీ అదే గదిలో సనత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి సనత్ ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీలోని బాయ్స్ హాస్టల్ మూడో అంతస్తులోని 318 నంబర్ గల రూంలో బెడ్ షీట్ లో ఈ తెల్లవారుజామున ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రేపటి నుంచే పరీక్షలు జరగాల్సిన తరుణంలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది.

వైద్య విద్యార్థి ఆత్మహత్య విషయం తెలుసుకున్న నిజామాబాద్ 1వ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన విద్యార్థిగా గుర్తించారు.

చదువుల ఒత్తిడి వల్లనే విద్యార్థి సనత్ ఆత్మహత్యకు పాల్పడినటట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సెల్ ఫోన్ చాటింగ్ తో విద్యార్థి మృతికి గల కారణాలను పోలీసులు గుర్తిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News