వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన.. మెహుల్ చోక్సీ అనే వజ్రాల వ్యాపారి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఇండియా నుంచి అంటిగ్వా పారిపోయిన చోక్సీ.. ఆ తర్వాత అక్కడి నుంచి డొమినికా వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో.. చోక్సీని భారత్ రప్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా.. అతడు చేసిన నేరాలకు సంబంధించిన వివరాలను సైతం డొమినికాకు పంపించింది.
గత సోమవారం అంటిగ్వా నుంచి వేరే దేశం పారిపోతున్న చోక్సీ.. డొమినికాలో పట్టుబడ్డాడు. దీంతో.. అతడిని అక్కడి కోర్టులోప్రవేశపెట్టారు. విచారణ పూర్తయిన తర్వాత అతడిని అంటిగ్వాకు అప్పగిస్తామని అక్కడి కోర్టు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే.. నేరుగా భారత్ రప్పించేందుకు ఇక్కడి దర్యాప్తు సంస్థలు కృషి చేస్తున్నాయి.
చోక్సీ పూర్తిగా భారతీయ పౌరుడని, ఇక్కడ వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయినట్టు ఆధారాలు చూపిస్తున్నాయి భారత దర్యాప్తు సంస్థలు. అంతేకాకుండా.. చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసు కూడా అందించినట్టు వెల్లడించాయి. అతడి నేరాల చిట్టాకు సంబంధించిన వివరాలను స్పెషల్ ఫ్లైట్ లో పంపించింది కేంద్రం. అటు అంటిగ్వా కూడా చోక్సీని నేరుగా భారత్ కు అప్పగించాలని కోరింది.
కాగా.. అతడిని డొమినికా నుంచి పంపించే విషయాన్ని అక్కడి కోర్టు జూన్ 2న వెల్లడిస్తామని తెలిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో చోక్సీ భారత్ కు వస్తాడా? రాడా? అనే విషయం చర్చనీయాంశం అయ్యింది. మరి, ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.