2012 డిసెంబర్ 16న అర్ధరాత్రి సమయంలో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై ఢిల్లీలో గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన అందరికి గుర్తుండే ఉంటుంది. కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ దారుణానికి అడ్డుపడిన నిర్భయ స్నేహితుడిపైన కూడా ఆ నింధితులు దాడి చేసారు. అలాగే బాధితురాలి మర్మాంగాల్లోకి పదునైన వస్తువులను జొప్పించడంతో తీవ్రగాయాలపాలైంది. డిసెంబర్ 29న సింగపూర్ లోని ఎలిజబెత్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటన పై దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చి నిర్భయకి న్యాయం జరిగేలా చేయాలనీ కోరారు. ఇకపోతే ఈ కేసులో ఆరుగురు నిందితులు దోషులుగా తెలగా, దోషుల్లో ఒకరైన రామ్ సింగ్ తీహార్ జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా.. దోషిగా తేలిన మైనర్ కు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. మిగిలిన నలుగురికి మరణశిక్ష విధించారు. ఈ మరణశిక్షని తప్పించుకోవడానికి , ఆ నలుగురు నింధితులు చేయని ప్రయత్నం అంటూ లేదు ..తమకున్న అన్ని న్యాయపరమైన అంశాలని వినియోగించుకొని ఇప్పటికే రెండు సార్లు ఉరి శిక్షని వాయిదా వేపించుకున్నారు. ఇక వారికున్న అన్ని అవకాశాలు కూడా ముగియడంతో ... మార్చి 3న తీహార్ జైల్లో వీరిని ఉరితీయనున్నారు.
ఇకపోతే , నలుగురు నిందుతులని మర్చి 3 న ఉరి తీయబోతున్న నేపథ్యంలో నిర్భయ దోషులు నలుగురు తమ శరీరాలను మెడికల్ రీసెర్చ్ కి ఇచ్చెందుకు, తమ అవయవాలను డొనేట్ చేయవలసిందిగాను వారికి ఆప్షన్ ఇచ్ఛేలా తీహార్ జైలు అధికారులను ఆదేశించవలసిందిగా మాజీ జడ్జి ఎఫ్. సల్దానా సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే , ఆ పిటిషిన్ ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఎవరికైనా కూడా కొంచెం మానవతా దృక్పథం ఉండాలని, ఒక వ్యక్తిని ఉరి తీయడమన్నది ఆ కుటుంబానికి విషాదకరమైన విషయమని, ఆ సమయంలో వారు ఎంతో విషాదంలో మునిగిపోయి ఉంటారని, అలాంటి సమయంలో మీరు దోషుల శరీరాలు ముక్కలు కావాలని కోరుతున్నారని, కాస్త మానవత్వం చూపాలని సూచించింది. అవయవదానం అన్నది సంబంధిత వ్యక్తులు స్వఛ్చందంగా ఇస్తారని సుప్రీం గుర్తు చేస్తూ ... పిటిషన్ ను కొట్టివేసింది.