హైదరాబాద్ లో పుట్టి దేశవ్యాప్తంగా విస్తరించిన ఎంఐఎం పార్టీ బీహార్ లోనూ బోణి కొట్టింది. బీహార్ లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎంఐఎం పోటీచేసి తొలిసారే గెలవడం సంచలనంగా మారింది. ఏకంగా తన ప్రత్యర్థి అయిన బీజేపీ పై ఈ గెలుపు సాధించడం ఎంఐఎం పార్టీని ఉత్సాహపరిచింది.
బీహార్ లోని కిషన్ గంజ్ ఉప ఎన్నికల్లో సమీప బీజేపీ ప్రత్యర్థి స్వీటీ సింగ్ పై పోటీచేసిన ఎంఐఎం అభ్యర్థి ఖమ్రూల్ హోడా గెలుపొందాడు.
ఇప్పటివరకు బీహార్ లో ఎంఐఎం పోటీచేయలేదు. తొలిసారి బీహార్ లో జరుగుతున్న ముస్లిం ప్రాబల్య ఐదు నియోజకవర్గాల్లో ఎంఐఎం అదృష్టం పరీక్షించుకుంది.
అయితే ముస్లింలు అధికంగా ఉన్న కిషన్ గంజ్ లో ఏకంగా బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఎంఐఎం ఓడించింది. ఇక మిగిలిన నాలుగు చోట్ల రెండు స్థానాల్లో అధికార జేడీయూ, ఒక స్థానంలో ఆర్జేడీ, మరో స్థానంలో స్వతంత్య్ర అభ్యర్థి, మరోస్థానంలో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. బీజేపీకి కేవలం ఒక స్థానంలో మాత్రమే ఆధిక్యతలో ఉండడం గమనార్హం.