కర్ణాటకలో వెలుగు చూసిన మంత్రిగారి రాసలీలల వ్యవహారం.. రోజుకో మలుపు తిరుగుతోంది. రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.. యడియూరప్ప ప్రభుత్వంలోని జలవనరుల శాఖ మంత్రి రమేశ్ జార్కి హోళి కొన్నాళ్ల కిందట ఓ యువతితో రాసలీలు గడిపిన వీడియో బయటకు వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.. సదరు యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి.. ఇలాంటి ఘటనకు పాల్పడ్డారంటూ... జార్కిహోళిపై తీవ్ర విమర్శలు రావడం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే బీజేపీ పెద్దలు రంగంలోకి దిగి.. జార్కిహోళితో పదవికి రాజీనామా చేయించారు. ప్రస్తు తం ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఈ కేసును విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణాధికారులకు రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. యువతితో రమేష్ జార్కిహొళి ఏకాంతంగా ఉన్నప్పుడు సీడీ రూపొందించినందుకు కొందరికి భారీగా ముడుపులు అందినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసులో అనుమానిత వ్యక్తుల ఖాతాల్లోకి లక్షలాది రూపాయల నగదు బదిలీ అయినట్లు తెలిసింది. సీడీ వ్యవహారంలో ఎనిమిది మంది ఉన్నట్టు గుర్తించిన సిట్ అధికారులు వీరి బ్యాంకు ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
అనుమానితుల ఖాతాల్లోకి నెల వ్యవధిలోనే లక్షలాది రూపాయలు జమ కావడంతో దీని వెనుక కుట్ర దాగి ఉందని భావిస్తున్నారు. కీలక నిందితుడు అరుణ్, అతడి ఖాతాలోకి భారీగా నగదు జమైనట్టు తేలింది. అరుణ్ సోదరుడి ఖాతాలో నెల రోజుల వ్యవధిలో రూ.40 లక్షలు జమ అయినట్లు అధికారులు గుర్తించారు. మరో నిందితుడు కూడా రెండు రోజుల కిందట బ్యాంకుకు వెళ్లి రూ.5 లక్షల డిపాజిట్ చేశాడు. ఇంకొక నిందితుడి ఖాతాలో రూ.26 లక్షలు జమైనట్టు గుర్తించామని సిట్ అధికారులు తెలిపారు.
ఇక, ఇప్పుడు తాజాగా రాసలీలల కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంపై సిట్ అధికారులు చేపట్టిన విచారణలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. రాసలీలల సీడీ యువతి బోయ్ ఫ్రెండ్ ఆకాశ్ కీలకమైన విషయాలను వెల్లడించారు. ఒకవైపు పెళ్లికి సిద్ధమవుతూనే మరోవైపు మంత్రితో రాసలీలలు జరిపినట్లు సిట్ దర్యాప్తులో వెలుగుచూస్తోంది. సీడీ వ్యవహారంలో డబ్బు పంచుకోవడంపైనా సిట్ కన్నేసింది. నిందితులందరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతోంది. ఈ పరిణామం మరోసారి రాజకీయంగా వేడెక్కించింది. మరి ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.