ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు గారి తనయుడు , ఎమ్మెల్సీ నారాలోకేష్ మరోసారి అడ్డంగా బుక్కైయ్యారు. సాధారణం గా లోకేష్ బయట మాట్లాడటం కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఇది అందరికి తెలిసిందే. ఇక అధికార పార్టీపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఎక్కుపెడుతుంటారు. ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న అనేక నిర్ణయాల పట్ల కూడా లోకేష్ ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ఆ అలవాటే ఆయన్ని మరోసారి బుక్ చేసింది. ఇంతకీ ఏమైంది అంటే ...
ప్రస్తుతం ఏపీలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు రాజధానుల బిల్లు ,
సిఆర్డిఏ రద్దు బిల్లు అసెంబ్లీ లో ఆమోదం పొంది , మండలి ముందుకి వచ్చాయి. ఈ బిల్లు పై మండలిలో చర్చ కి ముందు భారీ హైడ్రామా నడిచింది. ఎట్టకేలకి భారీ డ్రామా తర్వాత మండలిలో ఎట్టకేలకు మూడు బిల్లులపై చర్చ మొదలైంది. మెజార్టీని బట్టి ఆయా పార్టీలకు చైర్మన్ సమయాన్ని కేటాయించారు. ముందుగా టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మాట్లాడుతూ.. సీఎం నిర్ణయాలను ఏకి పారేశారు. అయితే ఆయన పదే పదే మొబైల్ ఫోన్ చూస్తూ మాట్లాడటం పై మంత్రి బొత్స అభ్యంతరం తెలిపారు. సభలో సెల్ ఫోన్ వాడటమేంటని నిలదీశారు.
మండలిలో లోకేశ్ మొబైల్ ఫోన్ వాడకం పై వెంటనే రూలింగ్ ఇవ్వాలని మండలి వైస్ చైర్మన్ ను మంత్రి బొత్స కోరడంతో ఈ వ్యవహారం పెద్ద రచ్చగా మారింది. ఇంత చిన్న విషయానికి రూలింగ్ ఏంటని విపక్ష ఎమ్మెల్సీలు వాపోయారు. దీనిపై పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాల సుబ్రమణ్యం జోక్యం చేసుకుంటూ.. మండలిలో వైఫై సౌకర్యం అందుబాటు లో ఉన్నప్పుడు, మొబైల్ ఫోన్ లో ఇంపార్టెంట్ నోట్స్ చూస్తూ మాట్లాడటం లో తప్పేముందని చెప్పడం తో ఈ వివాదం అక్కడితో సర్దుమణిగింది. సెల్ ఫోన్ వివాదం ముగిసిన తర్వాత టీడీపీ ఎమ్మెల్సీ లోకేశ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. సీఎం జగన్ ఏనాడూ అమరావతి ప్రాంతంలో పర్యటించలేదని, అలాంటప్పుడు ఇక్కడ అభివృద్ధి జరగలేదని ఎలా అంటారని ప్రశ్నించారు. రాజధాని తరలింపు వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అంటూ అమరావతికి మద్దతుగా తన వాయిస్ ని వినిపించారు.