గడిచిన కొంతకాలంగా ఆర్టీసీబస్సు ఛార్జీలు పెరుగుతాయన్న అంచనాలు భారీ ఎత్తున వినిపిస్తున్న వేళ.. అందుకు తగ్గట్లే తాజాగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి బయటకు పడేసేందుకు వీలుగా ఆర్టీసీ ఛార్జీలు పెంచక తప్పటం లేదని స్పష్టం చేశారు. పల్లె వెలుగుకు కిలోమీటర్ కు పావలా.. మిగిలిన సర్వీసులకు కిలోమీటర్ కు ముప్ఫై (30) పైసలు చొప్పున పెంచనున్నట్లు పేర్కొన్నారు. అయితే.. ఈ పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని.. ఓకే చెప్పినంతనే పెరుగుతాయని చెప్పారు.
బస్సు ఛార్జీలు పెరిగితే ఇప్పటికే ఉన్న నష్టాల్లో కొంతమేర అయినా తగ్గే వీలుందన్న అభిప్రాయాన్ని పువ్వాడ వ్యక్తం చేశారు. గడిచిన మూడేళ్లలో ఆర్టీసీ ఆదాయానికి.. ఖర్చుకు మధ్య అంతరం భారీగా పెరిగిపోయినట్లు పేర్కొన్నారు. ఈ మూడేళ్లలో ఆర్టీసీకి రూ.4260 కోట్ల మేర నష్టాలు వచ్చాయని.. వీటిని తగ్గించుకోవాలంటే ఛార్జీలు పెంపు తప్పించి మరో మార్గం లేదన్నారు.
2018-19లో రూ.4882 కోట్ల ఆదాయం రాగా.. ఖర్చు రూ.5811 కోట్లకు చేరుకుందని.. 2019-20లో రూ.4592 కోట్ల ఆదాయం రాగా.. ఖర్చు రూ.5594 కోట్లకు చేరినట్లు చెప్పారు. 2020-21లో ఆర్టీసీ ఆదాయం రూ.2455 కోట్లు ఉంటే ఖర్చు రూ.4784 కోట్లు ఉందని చెప్పారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించటం.. నెలల తరబడి బస్సుల్ని నడపకపోవటంతో ఈ ఒక్క ఏడాదిలోనే రూ.2329 కోట్ల నష్టం వచ్చింది. తాజాగా పంపిన ప్రతిపాదనల ప్రకారం ఛార్జీల పెంపు కారణంగా ఏడాదికి రూ.850 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని చెబుతున్నారు.
అంటే.. ఇప్పుడున్న నష్టాలు కొంత మేర తగ్గుతాయే తప్పించి.. మరెలాంటి ప్రయోజనం ఉండదన్నది అర్థమవుతుంది. డీజిల్ ధరల పెరుగుదల కూడా ఆర్టీసీకి భారంగా మారిందని చెబుతున్నారు. రోజువారీగా సగటున 6.8 లక్షల లీటర్ల డీజిల్ ను టీ ఆర్టీసీ వినియోగిస్తోంది. అయితే.. ఆర్టీసీకి ఇచ్చే డీజిల్ లో రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ను సగానికి తగ్గిస్తే.. సంస్థ నష్టాల్ని భారీగా తగ్గే వీలుంది.కానీ.. ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకునే కంటే.. ఛార్జీల పెంపుకే ప్రాధాన్యత ఇస్తుందని చెప్పక తప్పదు.