ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్స్ అంతకంతకు పెరిగిపోతున్నారు. ఒకపుడు ఫైర్ బ్రాండ్ అంటే ఫలానా అని ఒకరిద్దరిని మాత్రమే అనేవారు. ఇపుడు అలా కాదు, వివాదాలతోనే పాలిటిక్స్ ని నడిపించాలని చూసే వారు పెరిగిపోతున్నారు. దీని వల్ల తక్షణం కలిగే లాభం ఏంటి అంటే మీడియాలో బాగా హైలెట్ అవుతారు. సంచలనంగా నిలుస్తారు. టీవీ డిబేట్లూ, హాట్ డిస్కషన్స్ ద్వారా కొన్నాళ్ళ పాటు జనాల్లో నానుతారు.
దాంతో ఈ షార్ట్ కట్ మెథడ్ ని అందరూ ఫాలో అయిపోతున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఏపీలో అధికార పార్టీలో అంతకంతకు వీరి నంబర్ పెరగడమే చిత్రం. ముఖ్యమంత్రి జగన్ అయితే పలుకే బంగారం అన్నట్లుగా ఉంటారు. కానీ మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రం దూకుడుగా ఉంటారు.
ఇపుడు ఆ వరసలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీదరి అప్పలారాజు కూడా నిలిచారు. ఆయన పోలీసుల మీద చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పోలీసుల మీద మంత్రి హోదాతో సీదరి అనుచితంగా కామెంట్స్ చేయడం ద్వారా వివాదాల్లో చిక్కుకున్నారు.
పోలీసులను మంత్రులే గౌరవించకపోతే ఇక సామాన్య జనం సంగతేంటి అన్న చర్చ మొదలైంది. పైగా తమ ప్రభుత్వంలో తమ సిబ్బందికి తామే రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా అన్న విమర్శలు వస్తున్నాయి. ఇక వ్యక్తిగా సీదరి అప్పలరాజుని తీసుకుంటే ఆయన టాలెంట్ కలిగిన విద్యార్ధిగా ఉండేవారు. డాక్టర్ చదివి పలాసాలో మంచి పేరు తెచ్చుకున్నారు.
జగన్ ఆయనకు అక్కడ ఉన్న పేరుని చూసి అప్పటికి ఎందరు పోటీలో ఉన్నా 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఫస్ట్ అటెంప్ట్ లోనే సీదరి అప్పలరాజు రాజకీయంగా దిగ్గజ కుటుంబం అయిన గౌతు శిరీషన్ ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఏడాది తిరగకుండానే మంత్రి కూడా అయిపోయారు.
మరి ఆయన నాటి నుంచే దూకుడు పెంచేశారు అన్న మాట వినిపిస్తోంది. అయితే రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వారు, విద్యాధికుడు అయిన సీదరి అప్పలరాజు సుదీర్ఘ కాలం పాలిటిక్స్ లో ఉండాలంటే షార్ట్ కట్ మెథడ్స్ కాకుండా వేరే విధంగా వ్యవహరించాల్సి ఉందని అంటున్నారు.
ఇప్పటికే పలాసాలో సీదరికి రివర్స్ లో గాలి వీస్తోంది. ఈ టైమ్ లో ఆయన పోలీసుల మీద చేసిన కామెంట్స్ కానీ, ఆయన దూకుడు మీద కానీ విపక్షాలు గట్టిగానే తగులుకుంటున్నాయి. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, టీడీపీ నేత వర్ల రామయ్య వంటి వారు ఆయన మీద యాక్షన్ తీసుకోమంటున్నారు. ఇక విశాఖకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అయితే సీదరిని మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతున్నారు.
అసలే పనితీరు విషయంలో మార్కులు సీదరికి తగ్గాయని ప్రచారం ఉంది. ఈ సమయంలో ఇలాంటివి అవసరమా అన్న మాట కూడా సొంత పార్టీ నుంచే వస్తోంది. మరి విస్తరణలో సీదరి సీటు సిరిగిపోతుందా అంటే అవును అనే జవాబు వస్తోందిట. అదే సమయంలో ఎమ్మెల్యేగా పనితీరు పెంచుకోకపోతే 2024 ఎన్నికల్లో టికెట్ కూడా హుళక్కే అంటున్నారు. మొత్తానికి డాక్టర్ గారు వన్ టైమ్ మినిస్టర్, ఎమ్మెల్యేగా మిగలకుండా ఉండాలంటే చాలా కసరత్తు చేయాల్సిందే అంటున్నారు.