ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి.. వచ్చే మే నెలనాటికి .. మూడేళ్లు పూర్తవుతాయి. అయితే.. తన మంత్రి వర్గా న్ని పునర్‌వ్యవస్థీకరించేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆయన మంత్రులను మానసికంగా కూడా సన్నద్ధం చేశారు. రెండున్నరేళ్లలోనే తన మంత్రి వర్గాన్ని మారుస్తానని.. చెప్పినప్పటి కీ.. కరోనా నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగింది. ఇక, ఇప్పుడు ఎన్నికలు ముంచుకు వస్తున్న నేపథ్యంలో జగన్ వ్యూహాత్మకంగా పావులుకదుపుతున్నారు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ఆయన కీలకమైన నాయకులను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని.. భావిస్తు న్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు కూడా.. కీలకమైన నాయకులకే మంత్రి పదవులు ఇచ్చారు. అయితే.. ఇప్పుడు మరింతగా.. సామాజిక వర్గాలను ప్రభావితం చేయగల నాయకులను మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, ఇప్పుడు... మంత్రి వర్గం కూర్పునకు ముహూర్తం కూడా ఖరారు చేసిన నట్టు వైసీపీ సర్కిళ్లలో గుసగుస వినిపిస్తోంది.
వాస్తవానికి.. జూలై వరకు ఎలాంటి మార్పులు ఉండబోవని.. నిన్న మొన్నటివరకు ప్రచారం జరిగింది. జూలై 8న వైఎస్ జయంతిని పురస్కరించుకుని.. ప్లీనరీ నిర్వహిస్తున్నారు. ఈ ప్లీనరి ముందు.. మంత్రి వర్గాన్ని మార్చకుండా.. ప్లీనరీ తర్వాత మార్చాలని అనుకున్నారు.
అయితే.. ఈ నిర్ణయాన్ని ఇప్పుడు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 11నే మంత్రి వర్గ విస్తరణ చేపట్టేలా .. సీఎం జగన్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు.. ఎవరు పదవులు ఉంటాయి..? మరెవరికి ఊడిపోతాయి? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.. కేబినెట్‌లో ఉన్నవారిలో ఒక టెన్షన్ అయితే.. ఇక, కేబినెట్ పదవులు ఆశిస్తున్నవారిలోనూ ఈసారైనా పదవి దక్కుతుందా? లేదా? అనే టెన్షన్ నెలకొంది.
ఈ దఫా సామాజిక సమీకరణలకు మరింత ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు.. మహిళలకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి జగన్ వ్యూహం ఏంటో చూడాలి. మరోవైపు.. వైసీపీ నాయకులు చాలా మంది ఆశలు పెట్టుకుని ఉండడం గమనార్హం.