బాబ్బాబూ...బంగారాన్ని వదిలేయమని చెప్పండి
పెద్ద నోట్ల రద్దు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కుంటున్నట్లు కనిపిస్తోంది. వెలగపూడి సచివాలయంలో మొదటిసారిగా జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం పలు కీలకమైన అంశాలపై చర్చించగా ఇందులో సుదీర్ఘ చర్చ నోట్ల రద్దు-తదనంతర పరిణామాలు- ఇటీవల నిర్ణయించిన ముఖ్యమంత్రుల కమిటీ చుట్టే తిరిగింది. నోట్ల రద్దు వ్యవహారంపై రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. ఏదో ఒక దశలో నోట్ల రద్దు వ్యవహారానికి పుల్ స్టాప్ పెట్టాలని లేనట్లయితే ప్రజల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందనే అభిప్రాయం వ్యకమైంది. డిసెంబరు నెలాఖరు కల్లా నోట్ల రద్దు వ్యవహారాన్ని ఒక కొలిక్కి తేవాలనే దిశగా కేబినేట్ లో చర్చ జరిగింది.
పెద్ద నోట్ల వ్యవహారంతో ఇప్పటికే ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఈ నేపధ్యంలో బంగారం జోలికి కేంద్ర ప్రభుత్వం వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులంతా ముఖ్యమంత్రి చంద్రబాబును మూకుమ్మడిగా కోరారు. బంగారం విషయంపై కేంద్రంలో లోతుగా వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు అసంబద్దమైనవని పేర్కొన్న మంత్రులు ఈ విషయమై మరింత ముందుకు ప్రధాని వెళ్తే మహిళల్లో కలకలం రేగడం ఖాయమని సీఎం దృష్టికి తెచ్చారు. బంగారం జోలికి వెళ్లేందుకు కేంద్రం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నందువలన - ఆ ప్రయత్నాలను అడ్డుకునే దిశగా ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ముఖ్యమంత్రిని ఒత్తిడి తేవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా మంత్రుల అభిప్రాయాలతో ఏకీభవిస్తూ ప్రధానమంత్రి దృష్టికి బంగారం విషయం నేరుగా తీసుకువెళతానని హామీ ఇచ్చారు. నోట్ల రద్దు వ్యవహారాన్ని జాతీయ విపత్తుగా అభివర్ణించారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనని అవకాశాలను వినియోగించుకుంటుందని ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చూస్తామని తెలియజేశారు. ఇప్పటికే నోట్ల రద్దుతో ప్రభుత్వానికి రూ. 15 వందల కోట్ల నష్టంరాగా డిసెంబరు నెలలో మరో రూ. 15 వందల కోట్లు నష్టం రావచ్చని సమావేశంలో చర్చ జరిగింది. బంగారం నిల్వలు పెద్దనోట్ల వ్యవహారంపై ఆయా జిల్లాలో సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించి ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చూసే బాధ్యతను ముఖ్యమంత్రి ఇన్ చార్జ్ మంత్రులకు అప్పగించారు.
ఇదిలాఉండగా...పెద్ద నోట్ల వ్యవహారంలో అంతా గందరగోళం ఏర్పడిన నేపధ్యంలో కేంద్రం నియమించే సీఎంల కమిటీకి చంద్ర బాబు నేతృత్వం వహించడంపై మంత్రుల్లో భిన్నాభి ప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే అవినీతిపై - అక్రమ సంపాదనపై పోరాడే క్రమంలో కేంద్రం నోట్ల ను రద్దు చేసిందని ఈ పరిస్థితుల్లో ఏపీ సీఎం నేతృత్వం వహిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతాయనే అభిప్రాయాన్ని కొందరు మంత్రులు వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రుల కమిటీకి చంద్రబాబు నాయుడు నాయకత్వం వహించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కిన గౌరవంగా మరికొందరు మంత్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే తెలుగు దేశం పార్టీ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నదని దీంతో ముఖ్యమంత్రుల కమిటీకి నేతృత్వం వహించడం జగన్ అవినీతిపై పోరాటానికి సంకేతమేనని చంద్రబాబునాయుడు పేర్కొన్నట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/