ఆఫ్గనిస్తాన్ లో అమెరికా జరుపుతున్న బాంబు దాడుల్లో ఓ భారతీయుడు మరణించాడు. ఐఎస్ ఐఎస్ టెర్రరిస్టులే లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం జరిపిన ఈ డాదిలో కేరళకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’(ఎంఓఏబీ)గా పిలుచుకునే ప్రపంచంలోని అతి పెద్ద బాంబును ఆఫ్గనిస్తాన్ పై అమెరికా ప్రయోగించిన విషయం తెలిసిందే.
కేరళకు చెందిన ముర్షీద్ అహ్మద్ అనే వ్యక్తి కొంత కాలం క్రితం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. ఈ మేరకు తాను ఐసీస్ లో చేరినట్లు తండ్రికి అహ్మద్ టెలిగ్రాం చేశాడు. కాగా.. గురువారం అమెరికా ప్రయోగించిన అతిపెద్ద బాంబు దాడిలో అహ్మద్ కూడా మరణించినట్లు తెలుస్తోంది.
కాగా ఈ బాంబు దాడిలో మొత్తం 36 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో అహ్మద్ కూడా ఉన్నట్లు సమాచారం అందింది. కేరళ నుంచి మొత్తం 21 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరగా.. వీరిలో ఇప్పటికే నలుగురు ఆఫ్గనిస్తాన్ లో జరిగిన వేరువేరు ఘటనల్లో మృతి చెందారు. మరికొందరు ఇప్పటికీ ఐఎస్ సంస్థలో పనిచేస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం. మన దేశం నుంచి ఐఎస్ లో చేరినవారిలో కేరళకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/