మహిళల క్రికెట్ లో భారత్ ను సమున్నతంగా నిలిపి.. ఇన్నింగ్స్ ముగించింది హైదరాబాదీ మిథాలీ రాజ్. 23 ఏళ్ల కెరీర్ లో ఎన్నో రికార్డులను తన పాదాక్రాంతం చేసుకుందామె. అద్భుత సగటుతో పరుగులు.. అరుదైన స్థాయిలో కెప్టెన్సీ రోజులు.. అన్నిటికిమించి రెండు మూడు తరాలకు భారత మహిళల క్రికెట్ లో వారథి ఆమె. 39 ఏళ్ల మిథాలీ మరికొన్ని నెలల్లో 40వ ఏటలోకి ప్రవేశిస్తుంది. అయితే, పదేళ్ల వయసు నుంచే క్రికెట్ బ్యాట్ పట్టి కెరీర్ గా ఎంచుకున్న ఆమె.. 15 ఏళ్ల వయసుకే టీమిండియా దిశగా అడుగులు వేసింది.
ఇక 17 ఏళ్ల వయసులో టీమిండియాలో భాగమైంది. అప్పటినుంచి క్రికెట్టే ఆమె లోకమైంది. అలా మిథాలీ.. టీమిండియా అనే మెట్టినింటి గడప తొక్కింది. వాస్తవానికి మిథాలీ అంతర్జాతీయ అరంగేట్ర సమయానికి ఆమెది.. సగటు భారత సమాజంలో అమ్మాయిల పెళ్లి జరిగే వయసు. అయితే, కెరీర్ ఏమంత సజావుగా సాగకుంటే మిథాలీ పెళ్లి గురించి ఆలోచించేదేమో..? కానీ వెనక్కుతిరిగి చూడాల్సినంత అవసరం లేకపోవడంతో వివాహాన్ని ద్వితీయ ప్రాధాన్యంగా తీసుకుంది.
తానే వద్దని.. తానే కావాలని
వాస్తవానికి అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ మొదలైన అయిదేళ్లకే మిథాలీకి ఇంట్లో వాళ్లు సంబంధాలు చూశారు. కానీ, అప్పటికే ఆమె స్టార్ క్రికెటర్ అయిపోయింది. ఆటలో బిజీగా ఉంది. దీంతో సంబంధాలను తిరస్కరించింది. ఇక కెరీర్ మొదలైన పదేళ్లకు అంటే.. 27-30 ఏళ్ల మధ్య పెళ్లి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఓ వైద్యుడి సహా అనేక పెద్ద సంబంధాలే వచ్చినట్లు సమాచారం.
కానీ.. ఆ సంబంధాల్లో చాలా మంది క్రికెట్ కెరీర్ ను వదిలేయాలని చెప్పడంతో మిథాలీ నిర్మొహమాటంగా నో చెప్పింది. ఇలాంటి షరతులతో కూడిన వివాహాలు అవసరం లేదని ఇంట్లోవాళ్లతో తెగేసి చెప్పేసింది. అలా మిథాలీ క్రికెట్ కెరీర్ కోసం తన పర్సనల్ లైఫ్‌ని.. పెళ్లిని త్యాగం చేసింది.
ఇప్పుడైనా ఆలోచిస్తుందా?
నడి వయసుకు వచ్చిన మిథాలీ.. పెళ్లి గురించి ఇప్పుడైనా ఆలోచిస్తుందా? అనేది చూడాలి. తనదైన ఫిట్ నెస్ తో మహిళల క్రికెట్ లో 23 ఏళ్లు కొనసాగిన మిథాలీ తాజాగా రిటైర్మెంట్ ఇవ్వడంతో.. పెళ్లి గురించి ఆలోచన చేయొచ్చేమో. ఓ సందర్భంలో వివాహం గురించి ఆమెను ప్రశ్నించగా.. పెళ్లి చేసుకోనందుకు తానేం బాధపడడం లేదని.. సింగిల్ లైఫ్ చాలా సంతోషంగా ఉందని ఒక సందర్భంలో మిథాలీ చెప్పుకొచ్చింది. 'కొన్నాళ్ల క్రిందట నాకు పెళ్లి ఆలోచన వచ్చింది. అయితే ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. ఎందుకంటే పెళ్లైన వాళ్లను చూసిన తర్వాత సింగిల్‌గా ఉండడమే చాలా బెటర్ అనిపిస్తోంది.' అంటూ పేర్కొన్న మిథాలీ ఇప్పటికి సింగిల్‌గానే బతికేస్తుంది.
మరి రిటైర్మెంట్ తర్వాత ఒక తోడు కోసం పెళ్లి గురించి ఆలోచిస్తుందేమో చూడాలి. మిథాలీ డిసెంబర్ 3, 1982న రాజస్థాన్‌లో జోద్‌పూర్‌లో జన్మించిన మిథాలీ రాజ్, హైదరాబాద్‌లో చదువుకుంది. ఆంధ్రా టీమ్ తరుపున దేశవాళీ క్రికెట్ టోర్నీలు ఆడిన మిథాలీ రాజ్... ఎయిర్ ఇండియా, రైల్వేస్ టీమ్స్ తరుపున కూడా ప్రాతినిథ్యం వహించింది. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20 మ్యాచులు ఆడిన మిథాలీ రాజ్... టెస్టుల్లో 699, వన్డేల్లో 7805, టీ20ల్లో 2364 పరుగులు చేసింది. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లు కలిపి 10వేల పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా మిథాలీరాజ్ చరిత్ర సృష్టించింది.