ఫస్ట్ డోసు ఒక టీకా.. రెండో డోసు మరొ టీకా వేయించుకోవద్దు: డబ్ల్యూహెచ్‌వో
కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా మహమ్మారిపై పోరాటంలో ఇప్పుడు వ్యాక్సిన్ల పాత్రే కీలకం. ఇప్పటికే పలు సంస్థలు వ్యాక్సిన్లను అభివృద్ధి చేశాయి. ఈ నేపథ్యంలో మొదటి డోసు ఓ సంస్థకు చెందిన వ్యాక్సిన్ వేసి రెండో డోసు మరో వ్యాక్సిన్ వేసినా మంచి ఫలితం ఉంటుందని పలువురు నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే పలు దేశాల అధినేతలు కూడా రెండు వేర్వేరు టీకాలు వేయించుకున్నారు.
అయితే, ఈ తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ శాత్రవేత్త సౌమ్య స్వామినాథన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా వ్యాక్సిన్లను వాడితే ప్రమాదకరమని హెచ్చరికలు జారీ చేశారు. కరోనా వ్యాక్సిన్ల కాంబినేషన్ పై ఇప్పటివరకు సరైన డేటా అందుబాటులో లేదని చెప్పారు. అలాగే, ప్రజలే సొంతంగా ఏ వ్యాక్సిన్ తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో నిర్ణయించుకోవడం ఆందోళనకరమైన విషయమని తెలిపారు. రెండు డోసులు, మూడు డోసులు, నాలుగు డోసులు అంటూ ఎన్ని డోసులు వేసుకోవాలో సామాన్యులే నిర్ణయిస్తే తీవ్ర పరిణామాలు ఏర్పడతాయని సౌమ్య స్వామినాథన్ వ్యాఖ్యానించారు.
కాగా, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మొదటి డోసు ఆస్ట్రాజెనెకా సంస్థకు చెందిన వ్యాక్సిన్ వేయించుకుని, రెండో డోసు మాత్రం మోడెర్నా సంస్థకు చెందింది వేయించుకున్నారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగి కూడా వేర్వేరు వ్యాక్సిన్లను వేయించుకుని ఈ విధానాన్ని ప్రోత్సహించారు. కెనడా, యూకే, యురోపియన్ యూనియన్ లోని పలు దేశాలు, స్పెయిన్, దక్షిణ కొరియా కూడా ఇటువంటి విధానాన్ని అవలంబిస్తున్నాయి. ఆస్ట్రాజెనెకా మొదటి డోసు తర్వాత సమస్యలను తప్పించేందుకు ఈ విధానాన్ని పాటిస్తున్నట్లు ఆయా దేశాలు వెల్లడించాయి.
ఇక ఇదిలా ఉంటే .. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను భారత్ లో వినియోగిస్తున్నారు. కొన్ని దేశాల్లోనూ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.. కానీ, ప్రపంచ ఆరోగ్యసంస్థ మాత్రం ఇప్పటి వరకు కోవాగ్జిన్ పై క్లారిటీ ఇవ్వలేదు. ఈ మధ్యనే కోవాగ్జిన్ వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు డబ్ల్యూహెచ్ వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్, మరో 4 – 6 వారాల్లోగా లేదా ఆగస్టు తొలి వారంలో కోవాగ్జిన్ టీకాపై నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. భారత్ బయోటెక్, కోవాగ్జిన్ కు సంబంధించిన డేటాను తన పోర్టల్ లో ఇప్పుడిప్పుడే అప్ లోడ్ చేస్తోందని, ఆ డేటాను సమీక్షిస్తున్నట్టు తెలిపారు సౌమ్యా స్వామినాథన్ వెల్లడించారు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వెబినార్‌లో మాట్లాడిన సౌమ్యా స్వామినాథన్ కోవాగ్జిన్‌ను ఈయూఎల్‌లో చేర్చేందుకు ఒక ప్రక్రియ ఉంటుంది.. తయారీ సంస్థలు టీకాల మూడు దశల ప్రయోగాలను పూర్తిచేసి, ఆ డేటాను డబ్ల్యూహెచ్ వో రెగ్యులేటరీ విభాగానికి సమర్పించారు. తర్వాత నిపుణుల కమిటీ దాన్ని విశ్లేషిస్తోందన్నారు.