స్టాలిన్ మొదలెట్టేశాడు..

Update: 2017-02-07 11:39 GMT
అన్నా డీఎంకేలో అనిశ్చితి.. తమిళనాడులో నిమిష నిమిషానికీ మారుతున్న రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు డీఎంకే కాస్త ఆలస్యంగా రంగంలోకి దిగింది. కరుణా నిధి అనారోగ్యం కారణంగా యాక్టివ్ గా లేకపోవడంతో కుమారుడు స్టాలిన్ రాజకీయ ఎత్తుగడలకు పదను పెడుతున్నారు.  రాష్ట్రంలో పాలన అనిశ్చితిలో పడిందని, వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆయన లేఖ రాస్తూ, జయలలిత మృతి అనంతరం ఏర్పడ్డ పరిస్థితులను ఉదహరించారు. శశికళ సీఎం కావాలని భావిస్తుండటాన్ని తప్పుపట్టిన ఆయన, తమిళనాడు ప్రజలు ఆమెను అంగీకరించే పరిస్థితి లేదని, ఆమె సీఎం అయితే, ఉద్యమాలు జరుగుతాయని, రాష్ట్రం కల్లోలమవుతుందని అన్నారు. వెంటనే కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దాలని స్టాలిన్ కోరారు.
    
కొన్ని రోజుల క్రితమే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శశికళ నటరాజన్ ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ప్రయత్నిస్తుండడం.. పార్టీ ఓకే అన్నా ప్రజలు ఆమోదించకపోవడం.. తదితర అన్ని విషయాలనూ త‌మిళ‌నాడు ప్ర‌తిపక్ష నేత స్టాలిన్ ఇప్ప‌టికే రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి లేఖ రాసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై డీఎంకే మ‌రింత ముందుకు వెళ్లాల‌ని భావిస్తోంది. త‌మిళ‌నాడు సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించాల‌నుకుంటున్న‌ శ‌శిక‌ళ నిర్ణ‌యానికి వ్య‌తిరేకత తెలుపుతూ రేపు ఆ పార్టీ నేతలు ఢిల్లీకి బయలుదేరి ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోడీని కలవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆమె ప్రమాణస్వీకారం వ్యవహారంపై కేంద్ర ప్ర‌భుత్వం ముందు అభ్యంత‌రం తెలుపుతూ ఫిర్యాదు చేయబోతున్నారు.
    
తాజా పరిణామాలతో తమిళనాట పరిస్థితులు కాస్త గంభీరంగా ఉన్నాయి. రాజకీయంగా ఎప్పుడే మార్పు జరుగుతుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అసలు సీఎం పన్నీర్ సెల్వం కాస్త గట్టిగా ఉంటే ఇంతవరకు వచ్చేది కాదన్న మాట వినిపిస్తోంది. ఎన్ని సార్లు సీఎం పదవి చేపట్టినా సొంతంగా వర్గాన్ని తయారుచేసుకోలేకపోయిన పన్నీర్ సెల్వం ఫెయిల్యూర్స్ వల్లే శశికళ వంటి వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడానికి రెడీ అవుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News