వైసీపీ ఫైర్ బ్రాండ్, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మళ్లీ రెండోసారి కరోనా బారిపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
గత జులైలోనే అంబటి రాంబాబు కరోనా బారినపడ్డారు. చికిత్స తీసుకొని కోలుకున్నారు. అయితే నిన్న అసెంబ్లీలో మరోసారి నిర్వహించిన కోవిడ్ టెస్టులో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని అంబటి తెలిపారు.
ఇలా రెండోసారి కరోనా బారినపడడం.. రీఇన్ఫెక్షన్ కు గురికావడం ఆశ్చర్యం కలిగిస్తుందని అంబటి తెలిపారు. అవసరమైతే ఆసుపత్రిలో చేరుతానని అభిమానులు కంగారు పడవద్దని సూచించారు.
తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. హోం క్వారంటైన్ లో ఉండాలని అంబటి సూచించారు. అభిమానులు, కార్యకర్తల ఆశీస్సులతో కోవిడ్ ను జయించి వస్తానని అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు.