రాష్ట్రంలో కరోనా బాధితులను ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ లోని పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేపట్టిన సైకిల్ యాత్ర కొనసాగుతోంది. ఆదివారం ఆయన జోరు వానలోనూ తన యాత్ర కొనసాగించారు. కరోనా బాధిత కుటుంబాలను కలుసుకొని, వారిని పరామర్శించారు. పలు నిత్యావసరాలను కూడా పంపిణీ చేశారు.
యలమంచిలి మండలం కలగంపూడి గ్రామానికి 15 కిలోమీటర్ల దూరం సైకిల్ పై ప్రయాణించారు. జోరు వాన కురుస్తున్నా.. గొడుతో సైకిల్‌యాత్ర కొనసాగించారు. కలగంపూడి గ్రామానికి వెళ్లి అక్కడ కొవిడ్ బాధపడిన వారి కుటుంబాలను కలిశారు. వారిని పరామర్శించి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి పౌష్టికాహారం, నిత్యావసరాలను అందజేశారు ఎమ్మెల్యే.
ఈ సందర్బంగా మాట్లాడుతూ.. కరోనా కారణంగా బడుగు, బలహీన వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కరోనా మహమ్మారి బారిన పడిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని కూడా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కోరారు.
తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి 10 వేల రూపాయలను తక్షణ సాయంగా అందించాలని కోరారు. ఇక, కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం అందించాలని ఎమ్మెల్యే కోరారు. ఇప్పటికే కరోనా బాధితులు ఎన్నో విధాలుగా నష్టపోయారని, చాలా మంది ఆస్తులు తాకట్టుకు పెట్టుకున్నారని, కొందరు అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు డబ్బులతోపాటు తమవారి ప్రాణాలు సైతం కోల్పోయారని అన్నారు. వారందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని రామానాయుడు డిమాండ్ చేశారు.