అసెంబ్లీలో గోల‌గోల చేస్తున్న దెయ్యాలు

Update: 2018-02-23 11:57 GMT
ఆ అసెంబ్లీలో దెయ్యాలు తిరుగుతున్నాయా..? ఆ  ఎమ్మెల్యేల ప్రాణాలు దెయ్యాలు తీశాయా..? అంటే అవున‌నే అంటున్నారు. ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు గ‌డిచిన కొద్దికాలంలో వ‌రుస‌గా ముగ్గురు ఎమ్మెల్యే లు మ‌ర‌ణించ‌డంతో మిగిలిన ఎమ్మెల్యేలు ప్రాణభ‌యంతో బిక్క‌జ‌చ్చిపోతున్నారు.  

లాలూ ప్రసాద్ యాద‌వ్ కొడుకు ఎమ్మెల్యే తేజ్ ప్ర‌తాప్ యాదవ్ అధికారిక భ‌వ‌నాన్ని ఖాళీ చేశారు. ఆ భ‌వ‌నంలో దెయ్యాలు తిరుగుతున్నాయి. శాంతి హోమాలు చేసినా ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని ఆరోపించారు. అంతేకాదు ఆ దెయ్యాల్ని బీహార్ సీఎం నితీష్ కుమార్  - డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీలు పంపించార‌ని అనుమానం వ్య‌క్తం చేశారు.

 ఇప్పుడు త‌మ అసెంబ్లీలో దెయ్యాలు ఉన్నాయంటూ రాజ‌స్తాన్ కు చెందిన ఎమ్మెల్యేలు వాపోతున్నారు. రాజ‌స్తాన్ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో సెష‌న్స్ లో దెయ్యాల గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. 

నథ్వారా ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే కళ్యాణ్ సింగ్ - గత ఆగస్టులో బీజేపీ ఎమ్మెల్యే కృతి కుమారిలు చ‌నిపోయారు. దీంతో ప్రాణ‌భ‌యంతో అసెంబ్లీలో దెయ్యాలు తిరుగుతున్నాయ‌ని యాగాలు చేయించాల‌ని ఆ రాష్ట్ర ఎమ్మెల్యే హ‌బిబుర్ రెహ‌మాను చెప్పారు. శ్మ‌శానం మీదం అసెంబ్లీ ని నిర్మించారని - ఆ దెయ్యాల వ‌ల్లే 200మంది ఉండాల్సిన స‌భ్యులు రోజురోజుకి త‌గ్గిపోతున్నార‌ని అన్నారు. ఆ దెయ్యాల ప్ర‌భావంతో ఎమ్మెల్యేల‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు - జైలుపాల‌వుతున్నార‌ని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా దెయ్యాల వల్లే జరుగుతోందని ఆరోపించారు. అసెంబ్లీ భవనాన్ని శ్మశానం మీద నిర్మించారనే విషయాన్ని తాను సీఎం వసుంధర రాజేకు తెలిపానని - హోమాలు - పూజలు నిర్వహించి దెయ్యాలను వెళ్లగొట్టాలని కోరినట్లు రెహమాన్ తెలిపారు.

Tags:    

Similar News