పదవి పోయే వేళ.. ఈ మాటలు అవసరమా అశోకా?

Update: 2020-01-24 10:57 GMT
రాష్ట్ర విభజన సమయంలో అరడుగుల బుల్లెట్ గా అందరినోటా పిలిపించుకున్న అశోక్ బాబు.. ఆ తర్వాత టీడీపీకి మౌత్ పీస్ గా మారిపోవటం తెలిసిందే. ఆయన చేసిన సేవలకు గుర్తింపు అన్నట్లుగా ఎమ్మెల్సీ కట్టబెట్టారు చంద్రబాబు. విభజన వేళ.. ఊపులో ఏదేదో మాట్లాడిన అశోక్ బాబు.. ఆ తర్వాతి కాలంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టించుకున్నది పెద్దగా లేదన్న మాటను చెబుతుంటారు.

తాజాగా ఆయన చేసిన హెచ్చరికను చూస్తే.. వెనుకా ముందు లేకుండా ఈ తరహా వార్నింగ్ లు అశోక్ బాబు మాత్రమే ఇవ్వగలరేమోనన్న అభిప్రాయం కలుగక మానదు. మండలిని రద్దు చేయాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చెల్లదన్న ఆయన.. ఒకవేళ మండలి రద్దు నిర్ణయం అమలు జరిగే లోపే జగన్ జైల్లో ఉంటారన్నారు. పవర్ లో ఉన్నాను కదా? ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకోవటం ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్నది అశోక్ బాబు వాదన.

చట్టాన్ని అతిక్రమించిన బిల్లు కాబట్టే మండలి వ్యతిరేకించిందన్న ఆయన.. రాజధాని ఎక్కడ ఉండాలో ప్రజలకు తెలుసన్నారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా? మండలి రద్దు చేయాలని జగన్ నిర్ణయం తీసుకుంటే జగన్ అరెస్టు తప్పదన్న దానికున్న లాజిక్ ఏమిటో చెబితే బాగుంటుంది. నోటికి వచ్చినట్లు మాట్లాడే కన్నా.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని అదే పనిగా మాటలతో హెచ్చరించటం కారణంగా తనకున్న ఇమేజ్ తగ్గిపోతుందన్న విషయాన్ని మర్చిపోకుడదు. ఇంతకీ మండలిని రద్దు చేయాలన్న నిర్ణయం తీసుకున్న నిర్ణయం చెల్లదనటానికి తన దగ్గర ఉన్నపాయింట్ ఏమిటో బాగుంటుంది కదా? పోయే పదవిని తలచుకొని.. ముంచుకొస్తున్న దిగులుతో నోటికి వచ్చినట్లుగా అశోక్ బాబు మాట్లాడుతున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు లేవు?
Tags:    

Similar News