ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు కలిశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు - ఎంపీ సీఎం రమేష్ - కడప జిల్లాకు చెంందిన సీనియర్ నేత మల్లెల లింగారెడ్డిలతో కలిసి ఆయన భేటీ అయ్యారు. కాగా చెంగల్రాయుడితో పాటు మరో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిన మహమ్మద్ జానీ పదవీకాలం కూడా మార్చి నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో జానీ ఇప్పటికే కళా వెంకట్రావును కలిసి తెదేపాలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. చెంగల్రాయుడు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ మేరకు అది నిజమని తేలింది.
ఇదిలాఉండగా...ఈ ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చిలో ఏపీ శాసనమండలికి సంబంధించి స్థానిక సంస్థలు, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం. వీటికి మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. ఏపీ శాసనమండలి మొత్తం 7స్థానాలు ఖాళీ కానున్నాయి. ప్రస్తుత సమీకరణాల ప్రకారం మొత్తం 7 స్థానాల్లో ఒకటి వైకాపా, మిగిలిన ఆరు సీట్లు తెదేపాకు దక్కనున్నాయి. ఈ క్రమంలో సాంకేతికంగా కాంగ్రెస్ - వైకాపాకు తగినంత సంఖ్యాబలం లేనందున చైర్మన్ పదవి టీడీపీకి దక్కనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/