తెలంగాణ‌లో మ‌రో ఎన్నిక‌ల‌కు రెఢీ!

Update: 2019-01-24 06:01 GMT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసి.. పాల‌న ఒక కొలిక్కి వ‌స్తుంద‌న్నంత‌నే పంచాయితీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో.. ప‌లు కార్య‌క్ర‌మాలు ఆగిన ప‌రిస్థితి. పంచాయితీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేయ‌కుండా కేసీఆర్ ఉండిపోయారు.

ఇదిలా ఉంటే.. ఫిబ్ర‌వ‌రి మూడో వారంలో లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుంద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. పంచాయితీ ఎన్నిక‌లు ముగిసి వారాల వ్య‌వ‌ధిలోనే మ‌ళ్లీ ఎన్నిక‌ల హ‌డావుడి షురూ కానున్న వేళ‌..మ‌రో ఎన్నిక‌ల‌కు అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. తెలంగాణ‌ రాష్ట్ర శాస‌న‌మండ‌లిలో ఖాళీ స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న‌లో ఎన్నిక‌ల సంఘం ఉన్న‌ట్లు చెబుతున్నారు. పంచాయితీ ఎన్నిక‌లు ముగిసినంత‌నే మండ‌లి ఎన్నిక‌ల్ని నిర్వ‌హించాల‌ని భావిస్తోంది. ఇవి పూర్తి అయిన వెంట‌నే లోక్ స‌భ ఎన్నిక‌లు రానున్నాయి.

ప్ర‌స్తుతం మండ‌లిలో ఏడు స్థానాలు ఖాళీ కానున్నాయి. మార్చి నెలాఖ‌ర‌కు మ‌రో 9 స్థానాలు ఖాళీ కానున్నాయి. అంటే.. మొత్తం 15స్థానాల్ని భ‌ర్తీ చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా గ‌వ‌ర్న‌ర్ కోటాలోనూ మ‌రో స్థానాన్ని భ‌ర్తీ చేయాల్సి ఉంది. ఇవ‌న్నీ పంచాయితీ ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే చేప‌ట్టాల‌ని భావిస్తున్నారు.

ఎన్నిక‌లు జ‌రిగే స్థానాల్ని చూస్తే..

ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల ద్వారా 3 స్థానాల్ని భ‌ర్తీ చేయాల్సి ఉంది. స్థానిక సంస్థ‌ల కోటా నుంచి ఇద్ద‌రు. ఎన్నిక కావాల్సి ఉంది. . ఎమ్మెల్యే కోటా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ముగ్గురు ఎమ్మెల్సీలు ఇటీవ‌ల ఎన్నిక కావ‌టంతో వారి స్థానాలు ఖాళీ కానున్నాయి. ప్ర‌స్తుతం ఏయే స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌న్న విష‌యాన్ని చూస్తే..

+  పట్నం నరేందర్‌ రెడ్డి (రంగారెడ్డి) - కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి (నల్గొండ) - ఎమ్మెల్యే కోటా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచారు. వారు ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు.

+  ఎన్నికల ముందు టీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్‌ లో చేరిన స్థానిక సంస్థల కోటాలో గెలిచిన  కొండా మురళీధర్‌ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.

+  స్థానిక సంస్థల కోటా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎం.ఎస్‌.ప్రభాకర్‌(హైదరాబాద్‌) - భూపతిరెడ్డి(నిజామాబాద్‌)ల పదవీ కాలం మార్చితో ముగుస్తుంది. వారి స్థానాల్ని భ‌ర్తీ చేయాల్సి ఉంది. టీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి చేరిన భూప‌తి రెడ్డి ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోవ‌టం తెలిసిందే.

+  ఎమ్మెల్యేల కోటా నుంచి ఎన్నికైన షబ్బీర్‌ అలీ - పొంగులేటి సుధాకర్‌ రెడ్డి - టి.సంతోష్‌ కుమార్‌ - మహ్మద్‌ సలీం - మహమూద్‌ ఆలీ - కె.యాదవరెడ్డి పదవీ కాలం మార్చి నెలతో ముగినుంది.

+ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన భూపతిరెడ్డి - టీఆర్ ఎస్‌ కు దూరంగా ఉన్న యాదవరెడ్డి - గవర్నర్‌ కోటాలో నియమితులైన సభావత్‌ రాములు నాయక్‌లపై ఇటీవల అనర్హత వేటు పడింది. దీంతో ఆ మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి.


Full View

Tags:    

Similar News