అసెంబ్లీ లో కరోనా అలజడి ... ఎమ్మెల్సీ సతీష్‌కు పాజిటివ్ !

Update: 2021-03-22 08:30 GMT
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ కరోనా వైరస్ టెన్షన్ రోజురోజుకి పెరిగిపోతుంది. రాష్ట్రంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో , అసెంబ్లీ లో కరోనా పంజా విసిరిందట. ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ కు కరోనా పాజిటివ్ అని తేలిందట. శనివారం మండలి సమావేశాలకు హాజరైన ఎమ్మెల్సీ పురాణం సతీష్ మండలిలో మాట్లాడారు. దీంతో ఇప్పుడు కౌన్సిల్ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆయనతో సన్నిహితంగా మెలిగినవారంతా టెస్టులు చేయించుకునేందుకు సిద్ధం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి.

మరోవైపు ఈ మేరకు ఎమ్మెల్సీ సతీష్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పోస్ట్ చేశారు. ‘ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు,ప్రజలకు, నాయకులకు మనవి. నాకు రాపిడ్ టెస్ట్ లో నెగటివ్ రాగా, RTPCR టెస్టులో కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయినందున గత ఐదు రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు కోవిడ్ పరిక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.’ అని ట్విట్టర్‌లో సతీష్ పేర్కొన్నారు.  తాజా కరోనా బులెటిన్ ప్రకారం 24 గంటల్లో 337 మందికి కరోనా సోకినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు.  దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,455కి చేరింది. ఇందులో 2,98,826 మంది కోలుకొని డిశ్చార్జి కాగా 2,958 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక కరోనాతో రాష్ట్రంలో ఇద్దరు మరణించారు.  దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య  1671కి చేరింది.
Tags:    

Similar News