విశాఖ చుట్టూ రానున్న రోజుల్లో రాజకీయం తిప్పాలని వైసీపీ భావిస్తోంది. ఉత్తరాంధ్రా కంచుకోటలో మళ్లీ టీడీపీ తిష్ట వేయకుండా చూడాలని కూడా భావిస్తోంది. దీంతో లోకల్ బాడీస్ ని మొత్తం పట్టుబట్టి గెలుచుకుంది. విశాఖ మేయర్ సీటుని కైవశం చేసుకుంది. అయితే ఆ రోజులు పోయాయి. ఇపుడు రెండేళ్ళు ఇట్టే గడచిపోయాయి. రాజకీయంగా చాలా మార్పులు వచ్చేశాయి.
దాంతో ఈ టైం లో గెలుపు వైసీపీకి అవసరం పడుతోంది. ఎందుకంటే ఏడాది వ్యవధిలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఇపుడు గెలిస్తేనే 2024లో గెలుపు అని చెప్పుకునేందుకు వీలు అవుతుంది. ఉత్తరాంధ్రాలో తమ పట్టు గట్టిగా ఉందని లోకానికి చాటేందుకు కూడా కుదురుతుంది.
దాంతో వైసీపీ సర్వశక్తులూ ధారోబోస్తూ ఉత్తరాంధ్రా పట్టభద్రుల సీటుని కైవశం చేసుకోవాలని చూస్తోంది. నిజానికి చూస్తే మొదట్లో లైట్ గా ఈ ఎన్నికలను వైసీపీ తీసుకుంది. పెద్దగా సిటీకే పరిచయం లేని సీతం రాజు సుధాకర్ ని ఆరు నెలల క్రితమే జగన్ ప్రకటించారు. ఆ సమయంలో బ్రాహ్మణ ఓటర్లు విశాఖలో ఎక్కువ అని అంతా తమ వైపు టర్న్ అవుతారు అనుకున్నారు. బీజేపీ నుంచే పోటీ అనుకున్నారు. కానీ సీన్ మారింది.
ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ సీటు గెలుచుకోవడానికి టీడీపీ కూడా పట్టుబడుతోంది. ఆ పార్టీ మొదట టఫ్ కాంపిటేషన్ ని తీసుకువద్దామనుకుంది. కానీ తరువాత తన వ్యూహాన్ని మార్చేసింది. క్యాండిడేట్ నే మరొకరిని ఎంపిక చేసింది. కాపు నేపధ్యం ఉన్న వారు, అధ్యాపకుడిగా ఉన్న వేపాడ చిరంజీవిరావుని సెలెక్ట్ చేయడంతోనే టీడీపీ సగం విజయం సాధించింది అని అంటున్నారు. పరీక్షలకు కోచింగ్ ఇచ్చే అధ్యాపకుడిగా చిరంజీవిరావు నిరుద్యోగ యువకులకు పరిచయం, ఇక మూడు జిల్లాల్లో కాపులు ఎక్కువగా ఉన్నారు.
దీనికి తోడు టీడీపీ సంస్థాగత బలం కూడా ఉంది. ఈ రకంగా టీడీపీ దూకుడు చేస్తోంది. మొదట్లో పార్టీ నాయకులు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలను లైట్ తీసుకున్నా ఇపుడు అవకాశాలు అన్నీ కలసి వస్తుండడంతో పట్టు బిగిస్తున్నారు. దాంతో అధికార పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నా ఈ ఎన్నిక విషయంలో నిన్నటిదాకా పెద్దగా దృష్టి పెట్టలేదు అంటున్నారు. ఇపుడు అధినాయకత్వం ఆదేశాలతో అంతా తమ స్పీడ్ పెంచారు.
దాంతో చూస్తే వైసీపీకి టీడీపీకి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక చమటలు కార్చేలా ఉంది. డబ్బుకు వెరవకుండా టీడీపీ ముందుకు వస్తోంది. చంద్రబాబు అన్ని విషయాల పైనా జాగ్రత్తలు చెబుతూ ఎప్పటికపుడూ ఆదేశాలను జారీ చేస్తున్నరు. మరో వైపు వైసీపీ కూడా పకడ్బంధీగా ఏర్పాట్లు చేస్తోంది. రెండు లక్షల ఎనభై వేల ఓట్లు ఉన్న ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎన్నికల్లో లక్షా యాభై వేల దాకా విశాఖ సిటీలోనే ఉన్నాయి.
దాంతో రెండు పార్టీలకు చెందిన విశాఖ నాయకులు ఈ ఎన్నికలను ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. ఎమ్మెల్సీ గెలిచి వైసీపీకి తమ కంచుకోటలో ఓటమి ఏంటో చూపించాలని టీడీపీ ఆరాటపడుతోంది. వైసీపీ అయితే మళ్లీ తమదే విజయం అని చెబుతూ టీడీపీని ఓడిస్తామంటోంది. మొత్తానికి చూస్తే ఈ పోరులో బీజేపీ సిట్టింగ్ అభ్యర్ధి కాస్తా వెనకబడినట్లుగా కనిపిస్తోంది. అలాగే ఓటు బ్యాంక్ ఉన్న కామ్రేడ్స్ సైతం ఈ ట్రెడిషనల్ పాలిటిక్స్ తో పోటీ పడలేమని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.