తెలంగాణ ద‌వాఖ‌న‌..గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్‌ లోకి ఎక్కింది

Update: 2018-12-28 17:23 GMT
తెలంగాణకు మరో ప్రతిష్ఠాత్మకమైన అవార్డు లభించింది. వైద్య రంగంలో మొదటి సారి గిన్నిస్ రికార్డు లభించింది. ఎంఎన్‌ జే క్యాన్సర్ ఇన్‌ స్టిట్యూట్‌ కు గిన్నిస్ రికార్డు వరించింది. అక్టోబర్ 26న క్యాన్సర్ వ్యాధిపై చేపట్టిన అవగాహన కార్యక్రమంలో ఎక్కువ మందికి క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించిన సందర్భంగా ఈ అవార్డు లభించింది. ఈసందర్భంగా ఎంఎన్‌ జే క్యాన్సర్ ఇన్‌ స్టిట్యూట్ - వైద్య శాఖకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలియజేశారు.

హైదరాబాద్ లక్డీకాపూల్‌ లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఇన్‌ స్టిట్యూట్ రెండు ప్రపంచ రికార్డులు సాధించింది. గిన్నిస్ బుక్ రికార్డ్ - హైరేంజ్ ప్రపంచ రికార్డ్ సాధించింది. అక్టోబర్ 26 - 2018న హైదరాబాద్ లో ప్రొస్టేట్ క్యాన్సర్ పై భారీస్థాయిలో ఆరోగ్య అవగాహన సదస్సును ఎంఎన్‌ జే క్యాన్సర్ ఇన్‌ స్టిట్యూట్ నిర్వహించింది. ఇది ‘లార్జెస్ట్ మెన్స్ గ్యాదరింగ్’ గా గుర్తింపు పొందింది. ఇందులో 487 మంది పురుషులు పాల్గొన్నారు. క్యాన్సర్ డే సందర్బంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో…. MNJ ఇన్ స్టిట్యూట్ డాక్టర్లు… ప్రొస్టేట్ క్యాన్సర్ పై 45 నిమిషాల పాటు అవగాహన కల్పించారు. మెడిసిన్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన మొట్టమొదటి గిన్నిస్ రికార్డ్ గా ఈ ఈవెంట్ నమోదైంది.

రెండు ప్రపంచ రికార్డులు సాధించినందుకు… రాష్ట్ర ప్రభుత్వ కుటుంబ సంక్షేమ - వైద్య - ఆరోగ్య శాఖలను - MNJ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీని అభినందించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అత్యంత గొప్ప విజయాల్లో ఇదీ ఒకటని సీఎం కేసీఆర్ చెప్పారు. రెండు ప్రపంచ రికార్డులు సాధించిన మొట్టమొదటి గవర్నమెంట్ హాస్పిటల్ MNJ మాత్రమే అని.. ఇప్పటివరకు మరే సర్కారు దవాఖాన కూడా ఇలాంటి ఘనత సాధించలేదని సీఎం కేసీఆర్ చెప్పారు.


Tags:    

Similar News