చిత్తూరు జిల్లా నగరిలో సినీ ఫక్కీలో భారీ దోపిడీ చోటుచేసుకుంది. కంటైనర్ లోని సెల్ ఫోన్ల అపహరణ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మంగళవారం రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుర్ నుంచి ముంబైకి వెళ్తున్న మొబైల్ కంటైనర్ ను ఆంధ్రా తమిళనాడులోని దుండగులు అడ్డగించారు.
నగరి సమీపంలోని మరో లారీతో అడ్డం పెట్టారు. అనంతరం డ్రైవర్ ను చితకబాది అందులోని రూ.6కోట్ల విలువైన సెల్ ఫోన్లను దోచుకెళ్లారు.
మొత్తం 16 బాక్సులు ఉండగా.. 8 బాక్సుల్లోని 7500 మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. మొబైల్స్ ఉన్న లారీని పుత్తూరుకు తీసుకెళ్లి.. అక్కడ మరో లారీకి మార్చుకొని పరారయ్యారు. లారీలో మొత్తం రూ.12 కోట్ల విలువ చేసే మొబైల్ ఫోన్లు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ మొత్తం సెల్ ఫోన్లు అన్నీ రెడ్ మి కంపెనీవిగా పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకొని దుండగులు గాలిస్తున్నారు.