ఔను... మోడీ బాగా చెప్పారు.. బ‌ల‌మైన ప్ర‌భుత్వం అంటే...!

Update: 2022-07-31 00:30 GMT
ఔను.. ప్ర‌ధాన మంత్రి మోడీ బాగా చెప్పారు. బ‌ల‌మైన ప్ర‌భుత్వం అంటే.. వ్య‌క్తుల‌ను నియంత్రించ‌దు. వ్యవ‌స్థ‌ల‌ను బాగు చేస్తుంద‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌ల‌పై విశ్లేష‌కులు ఆస‌క్తిగా స్పందిస్తు న్నారు. తాజాగా ప్ర‌ధాని మోడీ పాల్గొన్న ఒక కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ''బ‌ల‌మైన ప్ర‌భుత్వం అంటే.. వ్య‌క్తుల‌ను నిర్బంధించ‌దు'' అని అన్నారు. అయితే.. దీనిపైనే.. తీవ్ర విమ‌ర్శ‌లు.. వ్యాఖ్య‌లు కూడా వ‌స్తున్నాయి.

కేంద్రంలో బ‌ల‌మైన ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఒక‌సారి కాదు.. రెండు సార్లు. 2014, 2019 ఎన్నిక‌ల్లో మోడీ స‌ర్కారు చాలా బ‌లంగా కేంద్రంలో కొలువు దీరింది. అయితే.. వ్య‌క్తుల‌ను నిర్బంధిస్తున్న‌దా.. లేదా.. అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. వ్య‌వ‌స్థ‌ల‌ను మాత్రం కూక‌టి వేళ్ల‌తో పెక‌లించి వేస్తున్న విష‌యం క‌ళ్ల‌కు క‌డు తున్న‌ద‌ని.. విశ్లేష‌కులు మండి ప‌డుతున్నారు. ప్ర‌జాస్వామ్య భార‌తికి హార‌తి ప‌డ‌తామ‌ని.. ప‌దే ప‌దే చెప్పే స‌చివులు.. రాష్ట్రాల్లో చేస్తున్న రాజ‌కీయ విన్యాసాలు.. అధికార లాల‌స‌లు..వెల‌గ‌బెట్టేందుకు.. 'బ‌ల‌మైన ప్ర‌భుత్వం' కార‌ణం కాదా?!

త‌మ మాట విన‌ని నేత‌ల‌పై ఒక‌ప్పుడు.. కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు.. సీబీఐని ప్ర‌యోగించి.. కేవ‌లం వ్య‌క్తుల వ‌ర‌కు మాత్రమే ప్ర‌భావితం చేసిన ప‌రిస్థితి నుంచి ఇప్పుడు వ్య‌వస్థ‌ల‌ను.. ప్ర‌భావితం చేసే వ‌ర‌కు.. మోడీ స‌ర్కారు దూకుడు.. వెనుక‌.. బ‌ల‌మైన ప్ర‌భుత్వమే ఉంద‌న్న‌ది నిష్టుర స‌త్యం.

త‌మ పార్టీలో చేర‌నంత వ‌ర‌కు.. త‌మ పార్టీ జెండా మోయ‌నంత‌వ‌ర‌కు.. అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారంటూ.. యాగీ చేసి.. ఈడీని ప్రోత్స‌హించి.. వీరంగం సృష్టించిన పెద్ద‌లే..క‌మ‌ల ద‌ళంలో చేరిన త‌ర్వాత‌.. వీస‌మెత్తు వివేచ‌న లేకుండా.. స‌ద‌రు దాడుల‌కు.. తెర‌దించిన ప‌రిణామాల‌ను ప్ర‌జ‌లు మ‌రిచిపోయార‌ని.. దీనికి బ‌ల‌మైన ప్ర‌భుత్వం.. కాద‌ని.. కూడా మోడీ చెప్పి ఉంటే బాగుండేద‌ని.. ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఒక‌ప్పుడు.. విధానాప‌ర‌మైన నిర్ణ‌యాల్లో విప‌క్షాల‌కు కూడా చోటు క‌ల్పించిన పేరెన్నిక‌గ‌న్న ప్ర‌జాస్వామ్యా న్ని.. నేడు.. ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌తో.. పార్ల‌మెంటు నుంచి స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేసి.. ఏకీకృత మూజువాణి ఓటు తో.. బిల్లులను బ‌దాబ‌ద‌లు చేసి.. ఆమోదం పొందుతూ.. భుజాలు త‌ట్టుకుంటున్నది.. బ‌ల‌మైన ప్ర‌భుత్వం కాదా?!  ఇదీ మోడీ ప్ర‌స్తావిస్తే.. బాగుండేది.

మొత్తానికి మోడీ చెబుతున్న దానికి.. చేస్తున్న‌దానికి ఎలాంటి పొంత‌నా.. ఎక్క‌డా.. సాప‌త్యం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. బ‌ల‌మైన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డంపై ప్ర‌జ‌ల ఆలోచ‌నా ధోర‌ణి ఎలా ఉన్నా.. బ‌ల‌మైన ప్ర‌భుత్వం కొంద‌రికి మాత్ర‌మే బ‌లాన్ని వ్వ‌డం.. భార‌త్ వంటి విశాల స‌మున్న‌త ప్ర‌జాస్వామ్య దేశానికి ఏమాత్రం మంచిది కాద‌ని.. విశ్లేష‌కులు చెబుతున్నారు.
Tags:    

Similar News