భారతీయ జనతా పార్టీ పెద్దలకు ఒక అలవాటు ఉంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో కొన్ని నెలలు ముందుగా పార్టీ పెద్దలు జాతీయ నేతలు వరస పర్యటనలు చేయడం. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి రాజుకున్న నేపధ్యంలో ఏపీ మీద బీజేపీ ఫోకస్ పెరిగింది. ఇప్పటిదాకా తెలంగాణా వైపే చూసిన బీజేపీ జాతీయ నేతలు ఇపుడు ఏపీలో వరస టూర్లకు ప్రణాళికలను సిద్ధం చేశారు.
ఈ నెల 8న విశాఖకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారు. ఆయన రోజంతా విశాఖలో గడపబోతున్నారు. ఎవెనింగ్ విశాఖలో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. దానికి ముందు పార్టీ నేతలతో సమావేశాలను నిర్వహించడమే కాకుండా వివిధ వర్గాల వారితో కూడా భేటీలు ఉంటాయని అంటున్నారు.
విశాఖ నుంచే బీజేపీని లేపాలని అమిత్ షా భావిస్తున్నట్లుగా ఉంది. ఏపీలో బీజేపీకి విశాఖలో కొంత బేస్ ఉంది. ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇక్కడ గెలుచుకున్న చరిత్ర ఉంది. 2024లో విశాఖ ఎంపీ సీటు మీద కన్నేసిన బీజేపీ అందుకే అమిత్ షాతో ప్రచారానికి రెడీ అయింది అని అంటున్నారు.
ఇక ఈ నెల 10న తిరుపతిలో బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పర్యటన ఉంది. ఆయన కూడా పార్టీ నాయకులతో మీటింగ్స్ తో పాటు సమావేశాలు భేటీలు పెట్టనున్నారు. సాయంత్రం తిరుపతిలో బీజేపీ భారీ సభలో ప్రసంగిస్తారు.
ఇలా ఇద్దరు కీలక నేతలు, బీజేపీ పెద్దలు ఏపీ లో కేవలం రెండు రోజుల వ్యవధిలో పర్యటించడం అంటే బీజేపీ ఏపీ మీద పెట్టుకున్న ఆశలు ఏ రేంజిలో ఉన్నాయో అర్ధం చేసుకోవాలి. జూన్ లో ఈ ఇద్దరు నేతల పర్యటనల తరువాత జూలైలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఏపీ టూర్ వేయనున్నారు అని తెలుస్తోంది.
నరేంద్ర మోడీ గత ఏడాది జూలైలోనే ఏపీకి వచ్చారు. నాడు భీమవరంలో ఆయన అల్లూరి 125వ జయంతి వేడుకలలో పాలు పంచుకున్నారు. అదే ఏడాది నవంబర్ లో విశాఖలో కూడా రెండు రోజుల పర్యటన చేపట్టారు. ఇది జరిగి ఎనిమిది నెలలు కావస్తోంది. ఇపుడు మోడీ ఏపీకి వస్తున్నారు.
అయితే గతంలో జరిగిన సభలు అన్నీ అధికారిక కార్యక్రమాలు మాత్రమే. ఈసారి మోడీ ఏపీకి వచ్చేది ఫక్తు రాజకీయ సభల కోసమే అంటున్నారు. ఏపీలో బీజేపీని స్థాయిని పెంచి వచ్చే ఎన్నికల్లో ఎంతో కొంత జనాలను తమ వైపు తిప్పుకోవడం కోసమే బీజేపీ త్రయం ఇలా ఏపీ విజిట్ చేస్తోంది అని అంటున్నారు
అయితే ఇప్పటిదాకా ఏపీలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మీద అమిత్ షా కానీ మోడీ కానీ పల్లెత్తు మాట అనలేదు. అలాంటి అవసరం కల్పించే సభలూ పెట్టలేదు. ఇపుడు రాజకీయ సభలే నిర్వహిస్తున నేపధ్యంలో మోడీ అమిత్ షా జగన్ మీద నేరుగా బాణాలు గురి పెట్టే అవకాశాలు ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది.
తమ పార్టీ బలం పెంచుకోవాలీ అనుకుంటే అధికారంలో ఉన్న పార్టీని గట్టిగా విమర్శించాలి. మరి ఏపీలో జగన్ తో గుడ్ రిలేషన్స్ బీజేపీ ఇప్పటిదాక మెయింటెయిన్ చేస్తూ వస్తోంది. వచ్చే ఎన్నికల తరువాత కూడా ఈ బంధాన్ని కొనసాగించాలని అనుకుంటోంది. దాంతో బీజేపీ నేతలు వైసీపీ మీద నేరుగా విమర్శలు చేస్తారా లేదా అన్న చర్చ సాగుతోంది. దానికి పూర్తి క్లారిటీ అమిత్ షా విశాఖ సభతోనే ఇవ్వబోతున్నారు అని అంటున్నారు.
బీజేపీ రాజకీయ వ్యూహాలు చూస్తే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లుగా ఉంటాయి. అందువల్ల మోడీ కానీ అమిత్ షా కానీ ఏ మాత్రం సంకోచం లేకుండా జగన్ మీద నేరుగా విమర్శలు చేస్తారనే అంటున్నారు. అదే కనుక జరిగితే ఏపీ రాజకీయాలు మరో మలుపు తిరగడం ఖాయమనే అంటున్నారు.