అతడికి మోడీ 6 నిమిషాలు టైమిచ్చారట

Update: 2016-12-17 11:30 GMT
గుజరాత్ రాష్ట్రాన్ని ప్రమోట్ చేసేందుకు తయారు చేసిన యాడ్ గుర్తుందా? ‘‘కుష్బూ గుజరాత్ కి’’ అంటూ పాపులర్ అయిన యాడ్ ను తయారు చేసిన పియూష్ పాండే.. ఆ యాడ్ ను తయారు చేసే క్రమంలో జరిగిన ఒక ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రధానిగా వ్యవహరించిన నరేంద్ర మోడీ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించే రోజుల్లో పాండేను.. గుజరాత్ రాష్ట్రాన్ని ప్రమోట్ చేసేందుకు ఒక యాడ్ కోసం పిలిపించారు.

మోడీతో కలిసి పని చేసిన రోజుల్ని గుర్తు చేసుకున్న పాండే.. ఈ యాడ్ ను రూపొందించేందుకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తాను కలిశానని.. ఆ సందర్భంగా ఆయనకు తాను చేయబోయే పని గురించి వివరిస్తున్న సందర్భంలో ఆయన కలుగజేసుకొని.. కేవలం ఆరునిమిషాలు మాత్రమే తాను టైం ఇస్తానని.. ఆ లోపు కథను చెప్పేయాలన్నారని గుర్తుచేసుకున్నారు.

అయితే.. తాను చేయబోయే పని మీద అప్పటికే పూర్తిస్థాయి అవగాహన ఉండటంతో తాను చేయబోయే పని గురించి వివరించినట్లు చెప్పారు. రతన్ టాటా నుంచి సాధారణ గేట్ కీపర్ వరకూ అందరి మనసుల్ని దోచుకునేలా యాడ్స్ ను రూపొందించే సత్తా ఉంది కాబట్టే.. మోడీ ఆరు నిమిషాల టైమిచ్చినా.. ఆయన్ను కన్వీన్స్ చేయటమే కాదు.. ఆయన మనసును దోచుకున్నాడని చెప్పాలి. అలా రూపొందించిన యాడ్.. తర్వాతి రోజుల్లో కోట్లాది మంది మనసుల్ని దోచుకుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News