మోడీ వాడే ఇంటర్నెట్ స్పీడ్ ఎంత?

Update: 2016-07-25 09:53 GMT
ఈ ప్రశ్నను అడిగితే తెల్లముఖం వేయాల్సిందే. కానీ.. ఇప్పుడా అవసరం లేదు. ఎందుకంటే.. సమాచార హక్కు చట్టం కింద మనసులోకి వచ్చిన ప్రతి సందేహాన్ని సంధించే అవకాశం చట్టం ఇవ్వటంతో.. ప్రధాని మోడీకి సంబంధించిన పలు అనుమానాల్ని.. ప్రశ్నల్ని పలువురు ప్రశ్నించారు. సమాచార హక్కు చట్టం కింద తమ దృష్టికి వచ్చిన పలు ప్రశ్నలకు పీఎంవో అధికారులు బదులిచ్చారు. ఈ సందర్భంగాకొన్ని వ్యక్తిగత ప్రశ్నలకు తాము సమాధానాలు ఇవ్వలేమని తేల్చిన పీఎంవో అధికారులు.. మరికొన్నింటికి మాత్రం సమాధానాలు ఇచ్చారు.

ఆసక్తికరంగా ఉన్న కొన్ని ప్రశ్నలు.. వాటికి పీఎంవో అధికారులు ఇచ్చిన సమాధానాలు చూస్తే.. మోడీ ఉపయోగించే ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ ఎంతన్న ప్రశ్నకు.. పీఎంవో  ఇచ్చిన సమాధానం ఏమిటంటే.. ‘‘సెకనుకు 34 ఎంబీ’’ అని. ఇక మోడీ వంటగదిలో ఎన్ని సిలిండర్లు ఉంటాయన్న ప్రశ్నకు.. ప్రధాని వంట గది ఖర్చు మొత్తం ఆయన వ్యక్తిగతమైనదని.. దానికి సమాధానం ఇవ్వలేమని తేల్చారు. ఇక.. ప్రధాని భారత రాజ్యాంగాన్ని చదివారా? అన్న ప్రశ్నను సంధించగా.. అది సమాచారహక్కు చట్టం కిందకు రాదని చెప్పారు.

ప్రధాని రోజుకు ఎన్ని గంటలు పని చేయాలన్న రూల్ ఏమైనా ఉందా? అన్న ప్రశ్నకు పీఎంవో బదులిస్తూ.. అలాంటిదేమీ లేదని.. అన్ని వేళల్లోనూ ప్రధాని విధుల్లోనే ఉంటారని పేర్కొంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ ఇప్పటివరకూ ఎన్ని సెలవులు తీసుకున్నారన్న ప్రశ్నకు.. ఆయన ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని పీఎంవో చెప్పింది. ప్రధాని మొబైల్ ఫోన్ నెంబరు ఇస్తారా? సామాన్యుడు ప్రధానికి మెసేజ్ పంపొచ్చా? అన్న ప్రశ్నకు.. ప్రధానికి పీఎంలో ఎలాంటి అధికారిక ఫోన్ ఇవ్వదని తెలిపిందే. సో.. మోడీ వాడే ఫోన్ నెంబరు ఆయన వ్యక్తిగతమైనదా..?
Tags:    

Similar News