వాల్ స్ట్రీట్ జర్నల్ తిట్లకు మోడీ ఆన్సర్

Update: 2016-12-25 07:37 GMT
దేశ ప్రజల్ని ఉద్దేశించి తరచూ మాట్లాడే ప్రధానిగా నరేంద్ర మోడీని చెప్పొచ్చు. ఆయన మానస పుత్రిక అయిన మన్ కీ బాత్ కార్యక్రమంతో దేశ ప్రజలకు నేరుగా తన సందేశాన్ని ఇవ్వటమే కాదు.. రాజకీయాలకు అతీతంగా ఆ కార్యక్రమాన్ని మార్చటమే కాదు.. స్ఫూర్తివంతమైన మాటలతో అందరి దృష్టి ఈ కార్యక్రమం మీదకు మళ్లేలా చేశారని చెప్పాలి.

తాజాగా మోడీ మరోసారి తన ‘మనసు మాట’ను బయటపెట్టారు. పెద్దనోట్ల రద్దుతో అవినీతిపై యుద్ధం మొదలైందని చెప్పిన ఆయన.. దేశ ప్రజలకు క్రిసమస్ గ్రీటింగ్స్ తో పాటు.. మాజీ ప్రధాని వాజ్ పేయ్ జన్మదిన శుభాకాంక్షలు కూడా చెప్పారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై రాజకీయ పార్టీలు మొదలు.. వాల్ స్ట్రీట్ జర్నల్ వరకూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. మోడీ దానికి తన సమాధానం అన్నట్లుగా మన్ కీ బాత్ వేదికను ఉపయోగించుకున్నారు.

పెద్దనోట్లను రద్దు నిర్ణయాన్ని ప్రశంసిస్తూ అనేక మంది లేఖలు రాస్తున్నారని.. దేశంలో డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గడిచిన కొద్ది రోజుల్లో 200 నుంచి 333 శాతం మేర క్యాష్ లెస్ లావాదేవీల సంఖ్య పెరిగినట్లు చెప్పిన మోడీ.. నోట్ల రద్దుతో అవినీతిపై యుద్ధం ప్రారంభించినట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా 30 కోట్ల రూపే కార్డులు ఉండగా.. జన్ ధన్ ఖాతాలు ఉన్న వారి వద్దే 20 కోట్ల రూపే కార్డులు ఉన్నట్లుగా వెల్లడించారు. డిజిటల్ మార్పు యువతకు.. స్టార్ట్ ప్ లకు కొత్త వ్యాపార అవకాశాలుగా మారటం ఖాయమన్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ నుంచి పలువురు వేలెత్తి చూపుతున్న విషయాలకు కౌంటర్ ఇస్తున్నట్లుగా మోడీ మాటలు ఉండటం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు.. పేద ప్రజలకు కార్డులు లేవన్న సందేహాలకు సమాధానంగా.. మోడీ చెప్పిన రూపే కార్డు లెక్కలున్నట్లుగా చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News